వికీలీక్స్ అసాంజే జైలు నుండి విడుదల

వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జులియన్‌ అసాంజేకు ఎట్టకేలకు విముక్తి లభించింది. లండన్‌ బెల్‌ మార్ష్‌ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. గూఢచర్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన నేరాన్ని అంగీకరించేందుకు సిద్ధమయ్యారు. అమెరికా ప్రభుత్వంతో జరిగిన ఒప్పందంలో భాగంగానే ఆయన బెయిల్ మీద విడుదలయ్యారని తెలుస్తోంది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆయనకు స్వేచ్చ లభించింది.

కోర్టులో సమర్పించిన పత్రాల ఆధారంగా ఆయన అమెరికా న్యాయ విభాగంతో ఒప్పందం కుదుర్చు కున్నట్లు తెలుస్తోంది. దీంతో కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వీలుగా ఆయన్ను యూకే జైలు నుంచి విడుదల చేశారు. ఈ పరిణామంతో సుదీర్ఘంగా కొనసాగుతున్న రహస్య పత్రాల ప్రచురణ కేసు ఓ కొలిక్కి రానుంది.పశ్చిమ పసిఫిక్‌లోని యూఎస్ కామన్వెల్త్ మరియానా ఐలాండ్స్‌లోని ఫెడరల్ కోర్టులో అసాంజే హాజరుకానున్నట్లు పత్రాల ద్వారా తెలిసింది. గూఢచర్యం చట్టానికి విరుద్ధంగా జాతీయ భద్రత కు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందడం, వ్యాప్తి చేయడం వంటి నేరారోపణలను అంగీకరించ నున్నారని తెలిపాయి. దీన్ని న్యాయమూర్తి ఆమోదిస్తే ఏళ్లుగా కొనసాగుతున్న అమెరికా న్యాయపోరాటా నికి ఓ పరిష్కారం లభిస్తుంది.

అగ్రరాజ్య సైన్యంలోని లోపాలను ఎత్తి చూపేందుకు ఆయన ఓ జర్నలిస్టులా వ్యవహరించారంటూ ప్రపంచవ్యాప్తంగా అసాంజేకు అప్పట్లో ఓ వర్గం మద్దతుగా నిలిచింది. అమెరికా మాత్రం చాలా సున్నిత మైన సమాచారాన్ని చట్టవిరుద్ధంగా పొంది లీక్‌ చేశారని ఆరోపిస్తూ వచ్చింది. తద్వారా జాతీయ భద్రతను ప్రమాదంలో పడేశారని వాదించింది. నేరాంగీకారం, శిక్ష ఖరారు తర్వాత అసాంజే ఆస్ట్రేలి యాకు చేరుకోనున్నారు. మరియానా ఐలాండ్స్‌లోని అతిపెద్ద ద్వీపమైన సైపన్‌లో అక్కడి కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఆయన కోర్టులో హాజరుకానున్నారు. అమెరికాకు రావడానికి ఆయన నిరాకరిం చడం వల్లే విచారణను అక్కడ చేపడుతున్నారు. పైగా అమెరికా అధీనంలో ఉండే ఆ భూభాగం ఆస్ట్రేలి యాకు సమీపంలో ఉంటుంది. తాజా ఒప్పందంలో భాగంగా అసాంజే నేరాన్ని అంగీకరించటంతో పాటు అదనపు జైలు శిక్ష నుంచి ఆయనకు విముక్తి లభించాల్సి ఉంటుంది.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్