బీఆర్‌ఎస్ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను అడ్డుకుకోవడంపై మాజీ మంత్రి KTR ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య పరిస్థితి అధ్యయనం చేయడానికి నిపుణులైన డాక్టర్లతో త్రిసభ్య కమిటీ వేశామన్నారు. గాంధీ ఆస్పత్రికి కమిటీని వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. వాస్తవాలను ప్రభుత్వం ఎందుకు దాస్తున్నదని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రయత్నించినా వాస్తవాలను దాచలేరన్నారు. వాస్తవ పరిస్థితిని బయటకు తీసుకొచ్చే వరకు బీఆర్‌ఎస్ పోరాటం ఆగదంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు.