తిరుమల తిరుపతి లడ్డూ వివాదం కోర్టు మెట్లు ఎక్కింది. సమగ్ర విచారణ కోరుతూ బీజేపీ, వైసీపీ నేతలు ఇద్దరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని… ఆ వ్యాఖ్యలపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అదే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించేలా ఆదేశాలివ్వాలని వైవీ సుబ్బారెడ్డి పిల్ వేశారు.