నల్గొండ జిల్లా లోక్ సభ స్థానాల్లో గెలిచేదెవరు?

నాగార్జునసాగర్ లాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టు ఉన్న జిల్లా నల్గొండ. ఇక్కడున్న ఏకైక ఎంపీ స్థానం కూడా ఇదే. అంతేకాదు. రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక స్థానాల్లో ఉన్న నేతలు, కీలక పాత్ర పోషించిన, పోషిస్తున్న నేతలు సైతం ప్రాతినిథ్యం వహించింది, వహిస్తోందికూడా నల్గొండ జిల్లా నుంచే. మరి అలాంటి చోట నుంచి రాబోయే ఎన్నికల్లో గెలిచేదెవరు ? పైచేయి సాధించేదెవరు ? లోక్ సభ ఎన్నికల వేళ ఇప్పుడు దీనిపైనే చర్చ.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సరిహద్దులు కలిసి ఉన్న జిల్లా నల్గొండ. 1952లో నల్గొండ పేరుతో ఎంపీ స్థానం ఏర్పాటైంది. మొదట్లో ఇది ద్విసభ్య స్థానంగా ఉంది. అప్పట్లో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో నల్గొండ, మిర్యాలగూడ ఎంపీ స్థానాలు ఉండగా, ఆ తర్వాత మళ్లీ 2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థానాలు అయ్యాయి. తెలంగాణలో జిల్లాల విభజన అనంతరం యాదాద్రి జిల్లా పరిధిలోకి భువనగిరి వెళ్లగా, నల్గొండ జిల్లా పరిధిలో ఏకైక ఎంపీ స్థానంగా నల్గొండ మిగిలింది.మొదటి నుంచీ ఈ ఎంపీ స్థానం కాంగ్రెస్ తోపాటు వామపక్షా లకు పెట్టని కోటగా ఉంది. అందుకు తగ్గట్లుగానే పలువురు వామపక్ష అగ్రనేతలు ఈ జిల్లా నుంచి ఎంపికయ్యారు. ఈ ఎంపీ స్థానం పరిధిలో నల్గొండ, నాగార్జునసాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానాలున్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య విషయానికి వస్తే 17 లక్షలా 18 వేల 954 మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళా ఓటర్ల సంఖ్య 8 లక్షలా 42 వేలా 247 మంది కాగా, పురుషుల సంఖ్య 8 లక్షలా 76 వేలా 538 మంది ఉన్నారు.

రాజకీయంగా చూస్తే, 2019 ఎన్నికల్లో పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున నల్గొండ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల విషయానికి వస్తే, హస్తం పార్టీ నుంచి సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి బరిలో ఉండగా, బీఆర్ఎస్ తరఫున కంచర్ల కృష్ణారెడ్డి అదృష్టం పరీక్షించుకుం టున్నారు. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా పార్టీ సీనియర్ నేతైన జానారెడ్డి కుమారుడ్ని బరిలో దింపింది. ఇప్పటికే నాగార్జునసాగర్, మిర్యాలగూడ సహా ఇతర నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు పార్టీకే చెందిన మిగిలిన సీనియర్లు. జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం రఘువీర్ ను గెలిపించాలంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలో అధికారం కోల్పోయి డీలా పడిన బీఆర్ఎస్.. లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలు సిద్ధం చేస్తోంది. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఈ స్థానం నుంచి కంచర్ల కృష్ణారెడ్డిని పోటీకి నిలిపింది. స్వయంగా కేసీఆర్ సైతం ఇప్పటికే పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించారు. మరోవైపు.. కమలం పార్టీ నుంచి బరిలో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. కేంద్ర పథకాలకు తోడు నరేంద్రమోడీ ఛరిష్మా తనను గెలిపిస్తుందని భావిస్తున్నారు. గతంలో జరిగిన ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే.. పదిసార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఐదుసార్లు సీపీఐ, రెండుసార్లు టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. చకిలం శ్రీనివాసరావు, ధర్మభిక్షం, సురవరం సుధాకర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి పలువురు నేతలు ఇక్కడ్నుంచి పోటీ చేసి పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహించిన వారే. దీంతో రాబోయే ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏ పార్టీ జెండా ఎగురుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్