ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ది రాజాసాబ్ అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. మారుతి తెరకెక్కిస్తోన్న ది రాజాసాబ్ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. ఇప్పుడు మరో భారీ చిత్రం ప్రారంభించేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇటీవల హనుమంతుడు నేపథ్యంలో రణమండల అనే భారీ సినిమాను నిర్మించనున్నట్టుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీ.జీ. విశ్వప్రసాద్ ప్రకటించారు. ఈ భారీ చిత్రాన్ని అనౌన్స్ చేయడమే కాదు.. ఆదోని రణమండల దేవాలయంలో ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అయితే.. ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎవరు అనేది ప్రకటించలేదు.
మరి.. ఈ భారీ చిత్రానికి దర్శకుడు ఎవరంటే.. దుర్గ దేవ్ నాయుడు పేరు వినిపిస్తోంది. ఇంతకీ.. ఈ దుర్గ దేవ్ నాయుడు ఎవరంటే.. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ మూవీస్ తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు.. అవార్డులు కూడా దక్కించుకున్నాడు. ఇటీవల ప్రవీణ్ ఐ.పీ.ఎస్ అనే సినిమాను కూడా డైరెక్ట్ చేశాడు.
ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఇది లక్కీ ఛాన్స్ అని చెప్పచ్చు. ఇది లేడీ ఓరియంటెడ్ మూవీ అని.. ఇందులో లీడ్ రోల్ కోసం తమన్నా, శృతిహాసన్, ఐశ్వర్య రాజేష్ పేర్లు వినిపించాయి కానీ. తమన్నాను కన్ ఫర్మ్ చేయనున్నారని టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ భారీ చిత్రాన్ని పూర్తి వివరాలతో త్వరలో ప్రకటించనున్నారు. విజువల్ వండర్ అనేలా ఈ భారీ చిత్రాన్ని.. ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో నిర్మించనున్నారని సమాచారం. అయితే.. ప్రచారంలో ఉన్నది నిజమేనా..? కాదా..? అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.