Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

ఈశాన్యంలో ఎవరి బలం ఎంత ?

 విభిన్న సంస్కృతులు, తెగలకు నిలయం ఈశాన్య రాష్ట్రాలు. ఈశాన్య భారతంలో 11 లోక్ సభ నియోజకవర్గాల్లో విభిన్న పరిస్థితి. అసోం లో 14 నియోజకవర్గాలలో జాతీయ పార్టీలు బలంగా ఉంటే, మిగతా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలతో పోటీ పడుతున్నాయి. హింసాకాండతో అట్టుడికిన మణిపూర్ లో ఎన్నికల భేరీ మోగింది. ఈశాన్య రాష్ట్రాల్లో పార్లమెంటు ఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం సిక్కిం. వ్యూహాత్మకంగా కీలకమైన ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక భద్రత మధ్య ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది.

 చైనా సరిహద్దులను ఆనుకుని ఉన్నఅరుణాచల్ ప్రదేశ్ లో రెండులోక్ సభ స్థానాలకు ఒకే దశలో ఏప్రిల్ 19న ఎన్నికలు జరుగుతాయి. 2009లో రెండు స్థానాలను కాంగ్రెస్ 2014 లో కాంగ్రెస్, బీజేపీ చెరో స్థానం గెలుచుకున్నాయి. 2019 లో రెండు స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఈ సారి కూడా అదే విధంగా రెండుస్థానాలు సాధించేందుకు పోటీ పడుతోంది. ప్రస్తుతం బీజేపీ బలంగా ఉంది. కేంద్రమంత్రి కిరణ్ రిజుజు, ఎంపీ తాపిర్ గావ్ మళ్లీ పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ రెండు చోట్ల పోటీ చేస్తోంది. మేఘాలయ లో రెండు నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వు. 2024 లోక్ సభ ఎన్నికలు 2 నియోజకవర్గాలకు ఒకే దశలో ఏప్రిల్ 19న జరుగుతున్నాయి. 2009లో 2014లో, 2019 లోనూ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చెరో స్థానం గెలుచుకున్నాయి. ఈ రాష్ట్రంలో 20 ఏళ్లుగా బీజేపీ బోణీ చేయలేదు. ప్రస్తుతం తుర స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి సాలెంగ్ ఏ సంగ్మా, ఎన్సీపీ నుంచి లోక్ సభ మాజీ స్పీకర్ పిఏ సంగ్మా కుమారుడు అగాథా సంగ్మా, తృణమూల్ నుంచి జెనిత్ సంగ్మా పోటీ చేస్తున్నారు. షిల్లాంగ్ లో ఎన్సీపీ నుంచి అంపదీప్ లింగ్డో పోటీ చేస్తున్నారు.

మిజో రామ్ లో ఏకైక లోక్ సభ స్థానానికి ఏప్రిల్ 19న ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ బహుముఖ పోటీలు జరుగుతున్నాయి. 2009 లోనూ, 2014, 2019 లోనూ ఏకైక సీటును కాంగ్రెస్ గెలుచుకుంది. మిజోరాం లో జోరం పీపుల్స్ పార్టీ ఏర్పడుతూనే అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం ఆ పార్టీ ఆధిపత్యం సాగుతోంది. ఆ పార్టీ తరుపున పారిశ్రామికవేత్త రిచర్డ్ వాన్ లాల్ హమంగ్ యిహాను పోటీ చేస్తున్నారు. బీజేపీ స్థానిక ఎంఎన్ ఎఫ్ తో పొత్తులో ఉంది. ఎంఎన్ ఎఫ్ కాంగ్రెస్ కు, జోరం పీపుల్స్ పార్టీకి గట్టి పోటీ ఇస్తోంది. నాగాలాండ్ లో ఏకైక లోక్ సభ స్థానానికి ఏప్రిల్ 19నే ఎన్నికలు జరుగుతాయి. నాగాలండ్ లో స్థానిక పార్టీలదే హవా. నాగాలాండ్ డెమోక్రటిక్ పీపుల్స్ పార్టీ, నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ దే ఆధిపత్యం. 2009లో నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్, 2014 లో కాంగ్రెస్, 2019 లో నాగాలాండ్ డెమోక్రటిక్ పీపుల్స్ పార్టీ గెలుచు కున్నాయి. ఈ సారి ఎన్ డిపీపీ నుంచి చుంబెన్ మర్రీ, కాంగ్రెస్ నుంచి ఎస్ ఎస్ జమీర్ పోటీ పడుతు న్నారు. ఇప్పటికీ తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ ఈ ఎన్నికల బహిష్కరణకు పిలుపు నిచ్చింది. ఈ ఆర్గనైజేషన్ ప్రభావం ఆరు జిల్లాల్లో ఉంది.

     ఈశాన్య భారతంలో మిగతా రాష్ట్రాలకు భిన్నమైన రాజకీయ నేపథ్యం త్రిపురది. దశాబ్దాల పాటు కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్న త్రిపురలో ప్రస్తుతం బీజేపీ ఆధిపత్యం వహిస్తోంది. రెండు స్థానాలకు ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య డైరెక్ట్ ఫైట్ జరుగుతోంది. త్రిపురలో రెండు లోక్ సభ నియోజకవ ర్గాలకు ఏప్రిల్ 19న, ఏప్రిల్ 26న రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. త్రిపురలో ఎస్టీ రిజర్వుడు సీట్ త్రిపుర ఈస్ట్ లో రాజకుటుంబానికి చెందిన కృతి సింగ్ దేబ్ బర్మ పోటీ చేస్తున్నారు. బీజేపీ టిప్రా మోతా ఒప్పందం మేరకు టిర్పా మోతా పార్టీ నుంచి కృతి సింగ్ దేబ్ బర్మ పోటీ చేస్తున్నారు. సీపీఎం కుచెందిన రాజేంద్ర రియాంగ్ ఆయన కు పోటీ ఇస్తున్నారు. త్రిపుర వెస్ట్ నుంచి బీజేపీ మాజీ సీఎం బిప్లవ్ కుమార్ దేబ్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఆశిష్ కుమార్ సాహ బరిలో ఉన్నారు.

   ఈశాన్య రాష్ట్రాల్లో పార్లమెంటుఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం సిక్కిం. సిక్కిం లోని ఒకే లోక్ సభ స్థానానికి 32 మంది సభ్యుల అసెంబ్లీకి ఒకే దశలో ఏప్రిల్ 19న ఎన్నికలు జరుగుతున్నాయి. సిక్కింలో ప్రాంతీయ పార్టీలదే హవా.. అయినా మోదీ పేరుతో రాష్ట్రంలో తనదైన ముద్రవేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. క్రిస్టియన్లు, బౌద్ధులు మెజారిటీ ఉన్న రాష్ట్రంలో స్థానిక తెగలు బలమైనవి. సిక్కిం మఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఆధ్వర్యంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా.. నుంచి సిటింగ్ ఎంపీ ఇంద్రహంగ్ సుబ్బ పోటీలో ఉన్నారు. స్థానిక సిక్కిం డెమాక్రటిక్ పార్టీ నుంచి పిడిరాయ్, కాంగ్రెస్ నుంచి గోపాల్ ఛెత్రి, బీజపీ నుంచి దినేశ్ చంద్ర నేపాల్ పోటీ చేస్తున్నారు. చిత్రంగా ఈ స్థానం నుంచి చతుర్ముఖపోటీ జరుగుతోంది. మణిపూర్ లో 2 లోక్ సభ స్థానాలకు రెండు దశల్లో ఏప్రిల్ 19న, ఏప్రిల్ 26న ఎన్నికలు జరుగుతాయి. ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్ నియోజకవర్గంలో సగం పోలింగ్ కేంద్రాల్లో ఏప్రిల్ 19న, మిగిలిన పోలింగ్ కేంద్రాల్లో ఏప్రిల్ 26 న ఎన్నికలు జరుగుతున్నాయి.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్