24.7 C
Hyderabad
Thursday, June 13, 2024
spot_img

జగన్ పై దాడి కుట్రేనా ? సానుభూతి వ్యూహమా?

ఏపీ సీఎం జగన్‌పై దాడి రాష్ట్ర రాజకీయాల్లో అలజడి రేపింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మరో దుమారానికి కారణ మైంది. జగన్‌పై దాడి కోడి కత్తి డ్రామాలాంటిదేనని విపక్షాలు ఆరోపిస్తుంటే,.. ముఖ్యమంత్రికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు కుట్ర చేశారని మండిపడుతున్నారు వైసీపీ శ్రేణులు. ఇంతకీ జగన్‌పై జరిగిన దాడి కుట్ర కోణ మేనా..?

మరోసారి ఏపీ సీఎం జగన్‌పై దాడితో రాజకీయ దుమారం రేగుతోంది. ఎన్నికల ప్రచారహోరులో భాగంగా మేమంతా సిద్ధం బస్సుయాత్ర చేస్తున్న జగన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు. విజయవాడలోని సింగ్‌నగర్‌ ప్రాంతంతో దాబాకోట్ల సెంటర్‌ వద్ద సభ బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న ఆయనపై పూలతోపాటు రాయిని విసిరారు. ఈ ఘటనలో జగన్‌కు ఎడమ కంటి పైభాగంలో గాయమైంది. దీంతో వెంటనే బస్సులోని వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. ఈ దాడిలో పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్‌ కూడా గాయపడ్డారు. చికిత్స తర్వాత జగన్‌ మళ్లీ యాత్రను ప్రారంభించారు. యాత్ర ముగించుకున్న అనంతరం వైద్యుల సూచనల మేరకు చికిత్స కోసం సీఎం జగన్‌ తన సతీమణి భారతితో కలిసి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. ప్లాస్టిక్‌ సర్జరీ, అనస్తీషియా, ఇతర వైద్యుల బృందం పలు వైద్య పరీక్షలు చేసి సీఎం జగన్‌కు చికిత్స అందించారు. ఎడమ కంటి కనుబొమ పైభాగాన లోతైన గాయానికి కుట్లు వేశారు. చికిత్స అనంతరం జగన్‌ తిరిగి తన నైట్‌ హాల్టు ప్రాంతానికి వెళ్లారు. ఆదివారం నాడు బస్సు యాత్రకు విరామం ప్రకటించారు.

   సీఎం జగన్‌పై దాడి ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఎంక్వైరీలో భాగంగా దాడి జరిగిన ప్రదేశాన్ని, అక్కడ ఉన్న స్కూల్‌ భవనం, పరిసర ప్రాంతాలను పరిశీలించినట్లు తెలిపారు విజయవాడ సీపీ కాంతి రాణా. యాత్ర నిర్వహిస్తున్న సమయంలో కరెంట్‌ వైర్లు తగులుతాయనే ఉద్దేశం తో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారని, దీంతో చీకటిగా ఉన్న పరిస్థితిని ఆసరాగా చేసుకుని దుండగులు దాడికి పాల్పడి ఉండొచ్చని చెప్పారు. ఆ ప్రదేశంలో సీసీ టీవీ కెమెరా లను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అనుమానితుల కదలికలపై ఆరా తీస్తున్నామని తెలిపారు. దుండగులను త్వరలోనే గుర్తించి అరెస్ట్‌ చేస్తామని తెలిపారు సీపీ కాంతి రాణా. మరోపక్క సీఎం జగన్‌ దాడి ఘటనపై ఈసీ ఆరా తీసింది. విజయవాడ సీపీకి ఎన్నికల ప్రధానాధికారి ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడ్డవారిని త్వరగా గుర్తించాలని.. ఘటనపై రేపటిలోగా నివేదిక పంపాలని ఆదేశించారు.

ఇక జగన్‌పై దాడితో అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్‌ ముదురుతోంది. సీఎం జగన్‌ కోసం జనం పోటెత్తుతున్నా రని.. ఆయనకు వస్తున్న ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేక టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డా రని వైసీపీ నేతలు ఆరోపిస్తు న్నారు. ఇక జగన్‌పై రాళ్లదాడి జరిగిందని తెలిసిన వెంటనే వైసీపీ శ్రేణులు ఎక్కడికక్కడే ఆందోళనలు చేపట్టారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే,.. ప్రతిపక్ష పార్టీ నాయకులు మాత్రం కోడికత్తి లాంటి డ్రామానే నని సెటారి కల్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. జగన్‌ ఎన్నికల ప్రచారానికి ప్రజల స్పందన కరువవడంతో 2.0కి తెరలేపారని సెటైర్లు వేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. యాత్రలో కరెంట్‌ పోవడం ఆ వెంటనే రాయి తగడలం జగన్‌ ప్లాన్‌ ప్రకారమే జరిగిందని ఆరోపించారు. 2019 ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి డ్రామాకు, విజయవాడ సింగ్‌నగర్‌లో సీఎంపై జరిగిన గులక రాయి దాడికి పెద్ద తేడా ఏమీ లేదన్నారు.

   మరోవైపు జగన్‌పై దాడిని విపక్ష నేతలంతా ఖండించారు. జగన్‌ సోదరి, ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఈ ఘటనపై స్పందించారు. రాళ్ల దాడిలో జగన్‌ గాయపడటం బాధాకరం, దురదృష్టకరమని అన్నారు. ఈ హింసను ప్రతి ప్రజాస్వామిక వాది ఖండించాలని కోరారు. అలాగే జగన్‌పై దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఖండించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక తెలంగాణ నేతలు కూడా ట్విట్టర్‌ వేదికగా దాడి ఘటనపై స్పందిం చారు. జగన్‌ అన్నా జాగ్రత్తలు తీసుకోండి. మీరు సురక్షితంగా ఉన్నారు సంతోషం. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానం టూ తన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు మాజీ మంత్రి కేటీఆర్‌. ఇది హేయమైన చర్య అని, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. అలాగే జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌ సహా పలువురు నేతలు దాడిని ఖండించారు. ఇంతకీ ఈ దాడి వైసీపీ ప్లాన్‌ ప్రకారం జరిగిందా..? లేదంటే ప్రతిపక్షాల కుట్రతో జరిగిందా..? అదే జరిగితే దాడి వెనుక ఉన్నది ఎవరూ అన్నది రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇదే అంశంపై కూపీ లాగే ప్రయత్నంలో ఉన్నారు పోలీసు లు. మరి కోడికత్తి మాదిరే ఏళ్లకొద్దీ సీరియల్‌ ఎపిసోడ్‌లా దర్యాప్తు సాగుతుందా..?, రాళ్ల దాడి ఘటనకు కారకులెవర్నది త్వరలోనే పోలీసులు తేలుస్తారా.. అన్నది ఆసక్తిగా మారింది.

Latest Articles

‘పద్మవ్యూహంలో చక్రధారి’ ట్రైలర్ రిలీజ్ చేసిన విశ్వక్ సేన్

వీసీ క్రియేషన్స్ బ్యానర్ పై కే. ఓ. రామరాజు నిర్మాతగా, సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం పద్మహ్యూహంలో చక్రధారి. ప్రవీణ్‌రాజ్‌కుమార్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. మాస్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్