29.2 C
Hyderabad
Friday, May 1, 2026
spot_img

కర్నూల్ ఎమ్మెల్మే హఫీజ్ ఖాన్ సక్సెస్ శాతం ఎంత?

    రాయలసీమలో అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటి కర్నూలు. ఇక్కడ్నుంచి 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన హఫీజ్‌ఖాన్ గెలుపొందారు. ఉన్నత విద్యా వంతుడైన హఫీజ్‌ఖాన్‌.. 2011లో రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన… 2016లో వైసీపీ కర్నూలు నియోజ కవర్గ ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. అనంతర పరిణామాల్లో 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన..టీడీపీ కేండిడేట్ టీజీ భరత్‌పై 5వేల 353 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. హఫీజ్‌ ఖాన్‌కు 72,819 ఓట్లు రాగా.. భరత్‌కు 67,466 ఓట్లు వచ్చాయి.

   నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల సంగతికి వస్తే.. ప్రధానంగా కర్నూలు నగరం మాత్రం అభివృద్ధి విషయంలో కాస్త మెరుగుపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నగర మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 33 డివిజన్లు ఉన్నా యి. ఇక్కడి ప్రజల తాగునీటి అవసరాల కోసం సుంకేసుల నుంచి నీరు సరఫరా చేయడానికి పైపు లైన్ల నిర్మాణం చేపట్టామని ఎమ్మెల్యే చెబుతున్నా పనులు నేటికీ పూర్తి కాకపోవడం కాస్త ఇబ్బందికరంగా మారింది. నిధుల కొరత కారణంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేప ట్టలేయారన్న విమర్శలు ఎమ్మెల్యేపై ప్రధానంగా విన్పిస్తున్నాయి. అయితే.. నియోజకవర్గ కేంద్రమైన కర్నూలులో ప్రధాన రహదారుల జంక్షన్లను ఆకర్షణీయంగా రూపొందించారు. కూడళ్ల వద్ద రంగు రంగుల బొమ్మలు వేయించారు. డివైడర్లను అందంగా తీర్చిదిద్దారు.

   కర్నూలు కార్పొరేషన్ పరిధిలో కొన్ని పనులు మినహాయిస్తే.. నియోజకవర్గం మొత్తంలో అభివృద్ధి ఎక్కడా అంటే ప్రశ్నార్థకమేనన్న వాదన విన్పిస్తోంది. వైసీపీ సర్కారు హయాంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాలు మినహాయిస్తే.. గత ఐదేళ్ల కాలంలో కర్నూలు నియోజకవర్గం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. కర్నూలు ఎమ్మెల్యేగా 2019లో విజయం సాధించారు హఫీజ్‌ ఖాన్. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ ఐదేళ్ల కాలంలో తాను నిధులు మంజూరు చేయించి పనులు చేపట్టి, పూర్తి చేసిన కార్యక్రమాలు ఒక్కటంటే ఒక్కటీ లేదన్న విమర్శలున్నాయి. నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న కొన్ని సమస్యల్ని గమనిస్తే.. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాల పేరుతో జీ ప్లస్ త్రీ నిర్మాణాలు చేపట్టింది. మొదటి విడతలో 4500 మంది లబ్దిదారులకు వీటిని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన చేతుల మీదుగా అందించారు. కానీ, మౌలిక వసతుల కొరత కారణంగా ఇక్కడ ఉండేందుకు ఎవరూ ఇష్టపడడం లేదు.

    విభజన చట్టంలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు స్టేట్ క్యాన్సర్ యూనిట్‌ను కేటాయించారు. 120 కోట్లతో దీన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే.. భవనాల నిర్మాణ పని పూర్తైనా, మిషనరీ మాత్రం ఇంతవరకు రాలేదు. అయినా.. మంత్రి బుగ్గన ప్రారంభించడం విశేషం. ఇక, బీసీ భవన్, ప్రాంతీయ ప్రజారోగ్య ప్రయోగశాలల పరిస్థితి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కస్టర్ యూనివర్సిటీ పరిధిలోని మూడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించారు. నిర్మాణాలు చేపట్టారు. 95 శాతం పనులు పూర్తైన సమయంలో నిధుల కొరతతో భవనాలకు పెయింటింగ్, ఎలక్ట్రికల్ పనులు చేపట్టకుండా నిలిపివే శారు కాంట్రాక్టర్. దీంతో.. ఇవి కాస్తా అసాంఘీక శక్తులకు అడ్డాగా మారాయన్న వాదన వినిపిస్తోంది. ఇక, కేవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్ధినిల సమస్య ఒక సవాల్‌గా మారింది. ఈ కాలేజీ ప్రాంగణంలో జూనియర్ విద్యార్ధుల కొసం 2 ఎకరాలు, అందుబాటులో ఉన్న14 భవనాలను కేటాయించాలని హైకోర్టు అదేశాలు జారీచేసింది. కానీ, ఆ ఆదేశాలు ఇంతవరకు అమలుకు నోచుకోవడం లేదన్న విమర్శలున్నాయి. మరో వైపు.. ఉర్థూ యూనివర్శిటీ పనులు, రైతు బజార్‌ విస్తరణ కార్యక్రమం.. ఇలా ఒకటేమిటి.. అనేక పనులు నిధుల కొరత పుణ్యమా అని అసం పూర్తిగా మిగిలిపోయాయి. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ సైతం ఈ విషయం పై పెద్దగా దృష్టి పెట్టకపోవడం వల్లే పరిస్థితి ఇలా తయారైందంటున్నారు నియోజకవర్గ ప్రజలు. ఎమ్మెల్యే విషయంలో ప్రజలకు పెద్దగా అభ్యంతరాలు లేకపోవడం హఫీజ్‌ఖాన్‌కు ప్లస్‌ పాయింట్‌గా మారిందని చెప్పాలి. పైగా ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం వల్లే అభివృద్ధి పనులు ఎమ్మెల్యే చేయలేకపోయారని అంటున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు ఎమ్మెల్యేకు 50-50 మార్కులు ఇస్తున్నారు ప్రజలు. మరి.. రాబోయే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి, అంతకు మించిన ఉత్కంఠ రేపుతోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్