వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ ఇక్బాల్ టీడీపీలో చేరుతున్నారు. నంద్యాల టీడీపీ కార్యాలయంలో మాజీమంత్రి ఫరూక్‌ను, ఎమ్మెల్సీ ఇక్బాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక్బాల్ తనను కలవడం చాలా సంతోషంగా ఉందని… శాసనమండలిలో ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తులలో ఇక్బాల్ కూడా ఒకరని ఫరూక్ తెలిపారు. మైనార్టీ హక్కుల గురించి, మైనార్టీ పరిరక్షణ కోసం ఇక్బాల్ పోరాటం చేశారన్నారు. సీఎం జగన్ మైనార్టీల ద్రోహి అని.. ప్రభుత్వంలో వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్నారని ఎమ్మెల్సీ ఇక్బాల్ విమర్శించారు. మైనార్టీలకు వైసీపీలో సముచిత స్థానం దక్కడం లేదన్నారు. ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానన్నారు. ప్రజలు సంక్షేమంగా ఉండాలంటే వ్యవస్థలలో మార్పు రావాలన్నారు. ప్రజలకు న్యాయం జరగాలంటే చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. టీడీపీలో చేరికపై రెండు రోజుల్లో స్పష్టత ఇస్తానన్నారు ఎమ్మెల్సీ ఇక్బాల్.
మాజీ మంత్రి ఫరూక్‌ను కలిసిన ఎమ్మెల్సీ ఇక్బాల్
0
229
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


