వివేకా.. గొడ్డలి పోట్లకు బలైపోయి ఐదేళ్లయిందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. నేటికి హత్య చేసిన వారికి చేయించిన వారికి శిక్ష లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లెలో షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో షర్మిలతో పాటు వివేకా కుమార్తె సునీత కూడా పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థిగా కడప నుంచి పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించాని షర్మిల కోరారు. వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం అని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత అన్నారు. కరవు సీమకు నీళ్లు తేవడం ముఖ్యం కాదా అని ఆమె ప్రశ్నించారు. తప్పు చేయాలంటే పదికి వందసార్లు ఆలోచిస్తామని, ఓటు వేసేముందు సరైన వ్యక్తిని ఎన్నుకోవాలని సూచించారు. ధర్మం వైపు ఉండాలంటే షర్మిలకు ఓటు వేయాలని సునీత విజ్ఞప్తి చేశారు.
షర్మిలతోపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వివేకా కుమార్తె సునీత
0
281
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


