ఏపీ రాజకీయాల్లో మరో దుమారం చెలరేగుతోంది. ఈ సారి వైసీపీలో కీలక నేత ఎంపీ విజయసాయిరెడ్డి టార్గెట్ అయ్యారు. ఏకంగా ఆయనపై వివాహేతర సంబంధం ఆరోపణలు.. యావత్తు ఏపీ ప్రజలు ఆశ్చర్యపోయేలా చేశారు. ఈ ఆరోపణల తర్వాత ఆయన మాత్రం చిక్కుల్లో పడ్డారు. స్వయంగా రంగంలోకి దిగి వివరణ ఇచ్చుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. అసలు వివాదం ఏంటంటే.. ఏపీ దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై.. ఆమె భర్త మదన్ మోహన్ తీవ్ర ఆరోపణలు చేశారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య శాంతి.. గర్భం దాల్చిందని.. దీనికంతటికీ కారణం ఓ ప్రముఖ వైసీపీ నేత అంటూ తెలిపారు. ఆ తర్వాత.. మరికొన్ని ఆరోపణలు చేస్తూ.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్ లు కారణమనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ .. మదన్ మాట్లాడారు. తన భార్య అక్రమ సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలంటూ దేవదాయ శాఖ కమిషనర్ ను కోరుతూ లేఖ విడుదల చేశారు. శాంతి భర్త మదన్ ఫిర్యాదుపై ఏపీ రాజకీయాల్లో పెద్ద అలజడే సృష్టించిందని చెప్పొచ్చు.
ఇదిలా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుండగా.. వెంటనే తన భర్త ఆరోపణలపై దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి రియాక్ట్ అయ్యారు. పూర్తిగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. 2013 నవంబర్ లో కేంద్ర ఉద్యోగి మదన్ మోహన్ తో పెళ్లి అయిందని.. ఇద్దరు పిల్లలు ఉన్నారని శాంతి తెలిపారు. తన భర్త మదన్ మోహన్ రెండేళ్లు.. దారుణంగా హింసించి కొట్టాడని ఆమె తెలిపారు. ఆ తర్వాత 2016లో గిరిజన సంప్రదాయం ప్రకారం..మదన్ నేను విడాకులు రాసుకున్నామని శాంతి తెలిపారు. 2019లో మదన్ మోహన్ అమెరికా వెళ్ళిపోయాడని తెలిపింది. అనుకోకుండా కొన్ని పరిస్థితుల్లో న్యాయవాది సుభాష్ తో పరిచయం ఏర్పడి.. ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నానని శాంతి తెలిపారు. సుభాష్ ను భర్తగా స్వీకరించగా.. ఓ బిడ్డ పుట్టాడని శాంతి తెలిపింది. మదన్ మోహన్ విషయంలో విశాఖ కోర్టు నుంచి విడాకులు తీసుకున్నామని శాంతి తెలిపింది. ఇదీ జరిగిన విషయమని.. అయితే ఈ అంశంలో తండ్రి లాంటి ఆయనపై దుష్ప్రచారం చేయడం అత్యంత దారుణమని శాంతి తెలిపారు. గిరిజన ఎస్టీ మహిళ అయినందునే వేధిస్తున్నారని.. మీడియా సమావేశంలో ఆవేదనకు గురై కన్నీళ్ళు పెట్టుకుంది.
ఇదిలా ఉండగానే ఇదే అంశంపై.. మహిళ విషయంలో తనపై వస్తున్న ఆరోపణలను, పార్టీ అంశాలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఓటమిపై మేము సమీక్షించుకుంటున్నామని.. ప్రజల తీర్పు ను గౌరవిస్తామని తెలిపారు. తన పేరు ప్రతిష్టలు దెబ్బ తీసిన వారెవరైనా..ఆఖరికి మా పార్టీలో ఉన్న వారైనా వదేలే ప్రసక్తి లేదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విజయవాడలో తన ఇంటికి వచ్చి తాను ఎక్కడ ఉన్నానో విచారణ చేశారని తెలిపారు. ఆ వ్యక్తి ఎక్కడకు రమ్మంటే.. తాను అక్కడకు వస్తానని.. భయం లేదని విజయసాయిరెడ్డి తెలిపారు. ఆధారాలు లేని ఆదివాసీ మహిళలకు అన్యాయం చేస్తున్నారని.. అవాస్తవాలు ప్రసారం చేసిన మీడియాతో ఎలా క్షమాణాలు చెప్పించాలో తెలుసన్నారు. ఈ కుట్ర, కుతంత్రాల వెనుక ఎవరు ఉన్నారో.. తేలుస్తానని.. ప్రతి పక్షంలో ఉన్నా ఎవర్నీ వదలనని.. దుష్ప్రచారం చేసినవారిపై చర్యలు ఉంటాయని విజయసాయిరెడ్డి తెలిపారు.