స్వతంత్ర, వెబ్ డెస్క్: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో రోజుకొక కీలక పరిణామం చోటుచేసుకుంటుంది. తాజాగా సీఎం జగన్ తల్లి వైఎస్ విజయలక్ష్మి అమరావతిలోని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నివాసానికి వెళ్లారు. అయితే ఆ సమయంలో సజ్జల అధికారిక విధుల్లో భాగంగా సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నారు. దీంతో ఆయన ఇంట్లో లేకపోవడంతో సజ్జల భార్యతో విజయమ్మ కాసేపు ముచ్చటించి వెళ్లిపోయారు. ప్రస్తుతం విజయమ్మ హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో కూతురు షర్మిలతో కలిసి ఉంటున్నారు. వాస్తవానికి విజయమ్మ పిలిస్తే క్షణాల్లో ఆమె వద్దకు సజ్జల వెళ్తారనేది బహిరంగ రహస్యం. అయినా కానీ ఆమే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లడంపై వైసీపీ వర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.