స్వతంత్ర, వెబ్ డెస్క్: నటసింహం నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు మేకర్స్. సక్సెస్‌ఫుల్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి ‘భగవంత్ కేసరి’ అనే పేరు పెట్టారు. ఈ సినిమాకి ఈ పేరు సెట్ చేయనున్నట్టు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. చివరికి ఇదే టైటిల్ ఖరారుచేసింది మూవీ యూనిట్. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో భూమిలో దిగబడిన ఒక బలమైన ఆయుధాన్ని పైకి లాగుతూ బాలయ్య కనిపిస్తున్నాడు.
ఇంతకుముందెప్పుడూ చూడని సరికొత్త పాత్రలో బాలకృష్ణ విశ్వరూపం చూపించబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రెండు రోజులు ముందుగానే అభిమానులకు బాలయ్య బర్త్ డే ట్రీట్ ఇచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో బాలయ్య ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. ఇక థమన్ సంగీతం అందిస్తుండగా.. షైన్‌స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌పెద్ది నిర్మిస్తున్నారు. ఈ ఏడాది విజయదశమి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
గిప్పడి సంది ఖేల్ అలగ్ 😎
Extremely proud to present our Hero, The one & only #NandamuriBalakrishna garu in & as #BhagavanthKesari 💥#NBKLikeNeverBefore ❤️🔥@MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna @Shine_Screens pic.twitter.com/bMXbhzDp6x
— Anil Ravipudi (@AnilRavipudi) June 8, 2023