తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లతో విజయ్ నేతృత్వంలోని టీవీకే అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ నేపథ్యంలో విజయ్ చెన్నైలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేత ఎంపిక, ప్రభుత్వం ఏర్పాటు అంశాలపై చర్చించారు. బుధవారం విజయ్ గవర్నర్ను కలవనున్నట్లు తెలుస్తోంది.
విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు స్థానాల్లో గెలవడంతో ఆయన ఏ నియోజకవర్గాన్ని కొనసాగుతారన్న ఆసక్తి నెలకొంది. పెరంబూర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగి, తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం.
అయితే పూర్తి మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు కోసం ఇతర పార్టీల మద్దతు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.


