38.2 C
Hyderabad
Tuesday, May 5, 2026
spot_img

హైదరాబాద్‌లో ప్రాణాలు తెగించి రౌడీషీటర్‌ని అడ్డుకున్న ఆటో డ్రైవర్‌కు ప్రశంసలు

హైదరాబాద్‌లో ఒక ఆటో డ్రైవర్ ప్రాణాలను పణంగా పెట్టి రౌడీ షీటర్‌ను అడ్డుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. బేగంబజార్ జిన్సీ చౌరాహా వద్ద ఉదయం మార్నింగ్ వాక్‌కు వచ్చిన మంజు ఓమ్లత మెడలోని బంగారు గొలుసును డబీర్‌పురాకు చెందిన రౌడీ షీటర్ మహ్మద్ సోహేల్ లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో అక్కడ ఉన్న ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ అప్రమత్తమై తన ఆటోతో నిందితుడిని ఢీకొట్టి కిందపడేసి అడ్డుకున్నాడు. నిందితుడు కర్రతో దాడి చేసినా జాహెర్ వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ఎదుర్కొన్నాడు.

జాహెర్ సహాయంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. తర్వాత పోలీసులు జాహెర్‌ను గుర్తించి, హైదరాబాద్ సీపీ సీవీ సజ్జనార్ అతడిని అభినందించారు. ఆయనకు నగదు బహుమతి , ప్రశంసాపత్రం అందజేశారు.

నిందితుడు మహ్మద్ సోహేల్‌పై ఇప్పటికే 16 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఆటో డ్రైవర్ జాహెర్ ధైర్యాన్ని నగర ప్రజలు ప్రశంసిస్తున్నారు.

Latest Articles

సంగారెడ్డి జిల్లాలో విషాదం.. బావిలో పడి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి

సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కంగ్టి మండలం బోర్గి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు కుమార్తెలు బావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. వివరాల ప్రకారం, తల్లి సావిత్రిబాయి తన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్