కేరళం సీఎం సస్పెన్స్‌కు తెర.. వీడీ సతీశన్ పేరును ప్రకటించిన అధిష్టానం

కేరళ ముఖ్యమంత్రి ఎంపికపై కొనసాగిన ఉత్కంఠకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. మాజీ ప్రతిపక్ష నేత, 61 ఏళ్ల వీడీ సతీశన్‌ను కాంగ్రెస్ పార్టీ కేరళ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. సీఎం రేసులో ఉన్న కే.సీ. వేణుగోపాల్, రమేష్ చెన్నితలను వెనక్కి నెట్టి సతీశన్ తుది ఎంపికగా నిలిచారు.

కేరళ సీఎం ఎంపికలో జరిగిన ఆలస్యం… గతంలో కర్ణాటకలో సీఎం పదవి విషయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య నెలకొన్న పరిస్థితిని గుర్తు చేసింది. అక్కడ ఇద్దరు నేతల మధ్య కొనసాగిన అంతర్గత విభేదాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చిన విషయం తెలిసిందే.

ఇక కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (UDF) ఎన్నికల్లో విజయం సాధించిన 10 రోజుల తర్వాత సీఎం పేరును అధికారికంగా ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (LDF) వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలన్న లక్ష్యాన్ని కోల్పోయింది.

వీడీ సతీశన్ ఎంపికతో ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

సతీశన్‌ రాజకీలయాల్లోకి రాక ముందు హైకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. పరవూర్ నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2001లో మొదటిసారి పరవూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సతీశన్‌.. .ఆ తర్వాత 2006, 2011, 2016, 2021 ,2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు వీ.డి.సతీశన్

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్