Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

ట్రంప్ అభ్యర్థిత్వం ఖరారైనట్లే !

         ఈ ఏడాది నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ పోటీ చేయడం దాదాపు ఖాయంగా తెలుస్తోంది. ఇప్పటికే లూసియానా ప్రైమరీలోనూ డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు.

అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలని డొనాల్డ్ ట్రంప్ చాలా కాలం నుంచి తహతహలాడుతున్నారు. కిందటే డాది ఫిబ్రవరి నెలలో ఈ మేరకు ఆయన తన అభీష్టాన్ని బాహాటంగా వెల్లడించారు. బైడెన్ హయాంలో ప్రపంచంలో అమెరికా ప్రాభవం తగ్గిందన్నది ట్రంప్ చేస్తున్న విమర్శ. ఒకప్పుడు అమెరికాను ప్రపంచదేశాలన్నీ గౌరవిం చేవన్నారు ట్రంప్. అయితే అధ్యక్షుడు బైడెన్ అనుసరిస్తున్న విధానాల ఫలితంగా అంతర్జాతీయంగా అమెరికా ప్రతిష్ట దెబ్బతిం దని ట్రంప్ అనేకసార్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు అసలు ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యానికి పూర్వ వైభవం రావా లంటే తన నాయకత్వమే శరణ్యమన్నారు డొనాల్డ్‌ ట్రంప్.

ఆఫ్గ‌న్ ప‌రిణామాలు, ఉక్రెయిన్ పై ర‌ష్యా సైనిక దాడిని నిలువ‌రించ‌డంలో వైఫ‌ల్యం, అంత‌ర్జాతీయ రాజ‌కీయాల్లో అమెరికా ఉనికిని నామ‌మాత్రం చేశాయ‌న్న‌ది డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ప్ర‌స్తుతం తాను అధ్య‌క్షుడిగా ఉండి ఉంటే అస‌లు ఉక్రెయిన్ పై రష్యా సైనిక దాడి జ‌రిగేదే కాద‌ని ట్రంప్ బ‌హిరంగంగానే వ్యాఖ్యానించారు. ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు న‌చ్చేచెప్పేవాడిన‌న్నారు. పుతిన్ కు న‌చ్చ‌చెప్పే శ‌క్తి సామర్థ్యాలు జో బైడెన్ కు లేవ‌న్న‌ది మొత్తంగా ట్రంప్ మ‌హాశ‌యుడి వ్యాఖ్య‌ల సారాంశం. మరోసారి వైట్ హస్ లో కూర్చోవడానికి ట్రంప్ మహాశయుడు ఎంత గా తహతహలాడుతున్నారో ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.

మేక్ అమెరికా గ్రేట్ అగైన్ … 2016లో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ ఉపయోగించిన మంత్రం ఇదే. ఈ మంత్రం జనంలోకి దూసుకెళ్లింది. అలాగే నేటివిటీని టార్గెట్ గా చేసుకుని ట్రంప్ మహాశయుడు చేసిన ప్రచారం కూడా ఫ‌లితాన్నిచ్చింది. కొన్ని తరాలుగా అమెరికాలో పుట్టి పెరిగిన నేటివ్ అమెరికన్లు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడు తుంటే, ఆసియా దేశాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన వారు కార్పొరేట్ రంగాల దిగ్గ‌జాలుగా మారుతు న్నారంటూ ట్రంప్ చేసిన ప్రచారం అమెరికా రాజకీయాల్లో దుమారం రేపింది. మొత్తంగా ట్రంప్ చేసిన విద్వేష‌పూరిత ప్రచారం అమెరికా రాజకీయాల్లో దుమారం రేపింది. భూమిపుత్రులైన అమెరికన్లను బాగా రెచ్చగొట్టింది. దీంతో భూమి పుత్రులు డొనాల్ట్ ట్రంప్ కు జై కొట్టారు. రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్‌నకు అభ్యర్థిత్వ ఖరారైతే ఈసారి కూడా అదే మంత్రాన్ని ఉప‌యోగించ‌డానికి డొనాల్డ్ ట్రంప్ రెడీ అవుతున్నారు.డొనాల్డ్ ట్రంప్ పై అమెరికా సమాజంలో నిన్న మొన్నటివరకు నెగటివ్ అభిప్రాయం ఉండేది. ప్రధానంగా అనేకానేక వివాదాల్లో చుట్టుకోవడమే ఆయనపై నెగటివ్ అభి ప్రాయం కలగడానికి ప్రధాన కారణం అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు.

డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి సైన్స్‌లో పట్టా పుచ్చుకున్నారు. ట్రంప్ తండ్రికి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. చదువు పూర్తయిన తరువాత 1968లో వారసత్వంగా వచ్చిన బిజినెస్ అఫైర్లు చూడటం మొదలెట్టాడు ట్రంప్. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ట్రంప్ బాగా సంపాదించాడు. అమెరికాలోని బడా వ్యాపారుల్లో ఒకడిగా డొనాల్డ్ ట్రంప్ ఎదిగాడు. అయితే వ్యాపారవేత్తగా సంపాదించిన ఐశ్వర్యం, సాధించిన పేరుతో డొనాల్డ్ ట్రంప్ సంతృప్తి పడ లేదు. రాజకీయాల్లోనూ ప్రవేశించాలని తహతహలాడారు. అమెరికా సమాజం భవిష్యత్తును నిర్దేశించే పాలిటిక్స్ లోనూ హల్‌చల్‌ చేయలని డిసైడ్ అయ్యారు. దీంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు ట్రంప్ మహాశయుడు.

ఇదిలా ఉంటే రాజకీయాల్లో డొనాల్డ్ ట్రంప్ జంపింగ్ జపాంగ్‌ కిందే లెక్క. కొంతకాలం రిఫార్మ్‌ పార్టీలోనూ మరికొంత కాలం డెమొక్రటిక్ పార్టీలోనూ ట్రంప్ కొనసాగారు. చివరకు రిపబ్లికన్ పార్టీలో తేలారు. అంచెలంచెలుగా రిపబ్లికన్ పార్టీలో ఓ పెద్ద లీడర్‌ గా ఎదిగారు. సాదాసీదా పదవులతో సంతృప్తి పడే రకం కాదు ట్రంప్. కొడితే ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టాలనే మనస్తత్వం ఆయనది. ఎప్పటికైనా అమెరికా ప్రెసిడెంట్ కావాలనేది ట్రంప్ మహాశయుడి చిరకాల కోరిక. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవి ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం ట్రంప్ అనేక సార్లు ప్రయత్నాలు చేశారు. 1988, 2004,2012 ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే ట్రంప్ ఎన్నిసార్లు ప్రయ త్నించినా ట్రంప్‌నకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం దక్కలేదు. అయితే డొనాల్డ్ ట్రంప్ ది ఉడుం పట్టు. అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం కోసం ప్రయత్నాలు ఆపలేదు. చివరకు ట్రంప్ ప్రయత్నాలు ఫలించాయి. 2016లో డొనాల్డ్ ట్రంప్‌కు రిపబ్లిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం దక్కింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి అమెరికాకు 45వ అధ్యక్షు డయ్యారు.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్