‘అల్లు అర్జున్ ప్రాపర్టీ’ అంటూ ట్రోల్.. ఘాటుగా బదులిచ్చిన హీరోయిన్

హీరోయిన్ సీరత్ కపూర్ సోషల్ మీడియాలో చేసిన ఓ రిప్లై ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తున్న ఫోటోలను సీరత్ కపూర్ షేర్ చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అల్లు అర్జున్ 44వ పుట్టినరోజు సందర్భంగా ఆ ఫోటోలను ఆమె పోస్టు చేశారు. దీంతో నెటిజన్లు ఆ ఇద్దరి మధ్య స్నేహంపై వివిధ రకాలుగా కామెంట్లు చేయడం ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో తాజాగా సీరత్ కపూర్ షేర్ చేసిన ఓ ఫోటోపై ఓ ట్రోల్ అసభ్యకరంగా స్పందించాడు. “అల్లు అర్జున్ ప్రాపర్టీ” అంటూ కామెంట్ చేయగా… సీరత్ అతనికి ఘాటుగా సమాధానం ఇచ్చింది.

seerath kapoor allu arjun

 

“హార్ట్ ఐస్ ఎమోజీ పెట్టినంత మాత్రాన అది గౌరవంగా మారదు సర్. ఒక మహిళ ఎప్పుడూ ఎవరి ప్రాపర్టీ కాదు. ఆమెకు తనకంటూ ఓ వ్యక్తిత్వం, కలలు, అభిప్రాయాలు ఉంటాయి. అభిమానించండి… కానీ సొంతం చేసుకున్నట్టు మాట్లాడొద్దు. గౌరవంతో ప్రవర్తించండి” అంటూ సీరత్ కపూర్ రిప్లై ఇచ్చింది.

సీరత్ ఇచ్చిన ఈ సమాధానంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల గౌరవం గురించి ఆమె చెప్పిన విధానం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఇక అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా కూడా సీరత్ ప్రత్యేక పోస్టు పెట్టింది. “హ్యాపీ బర్త్‌డే బన్నీ. మీరు మీ నటనను, వ్యక్తిగత సంబంధాలను ఎంతో సహజంగా, హుందాగా కొనసాగిస్తారు. మీకు మంచి ఆరోగ్యం, మరింత విజయాలు కలగాలి” అంటూ ఆమె విషెస్ తెలిపింది.

సీరత్ కపూర్ చివరిసారిగా 2023లో వచ్చిన ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్‌లో కనిపించింది. అలాగే 2024లో విడుదలైన ‘భామాకలాపం 2’, ‘మనమే’ సినిమాల్లో నటించింది. ‘ఉషా పరిణయం’ చిత్రంలోని ‘ఘల్లు ఘల్లు’ స్పెషల్ సాంగ్‌లో కూడా మెరిసింది. ప్రస్తుతం ఆమె ‘ఝటస్య మరణం ధృవమ్’ అనే చిత్రంలో నటిస్తోంది.

మరోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీతో కలిసి చేస్తున్న భారీ సై-ఫై యాక్షన్ మూవీ ‘రాకా’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం కావడం విశేషం. ఇటీవల ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల కాగా భారీ స్పందన లభించింది.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్