31.2 C
Hyderabad
Monday, May 11, 2026
spot_img

విజయ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం త్రిష మొదటి పోస్ట్‌ వైరల్‌.. “The Love Is Always Louder”

తమిళనాడు రాజకీయాల్లో చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిన టీవీకే అధినేత, నటుడు విజయ్‌( Vijay) ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార వేడుకకు ప్రముఖ నటి త్రిష కృష్ణన్‌( Trisha Krishnan) హాజరుకావడం ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ హాట్‌టాపిక్‌గా మారింది. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం (Jawaharlal Nehru Stadium) లో ఆదివారం ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో విజయ్‌ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు త్రిష ప్రత్యేకంగా హాజరవడం, ఆ తర్వాత ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ప్రమాణ స్వీకార వేడుక అనంతరం త్రిష తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫొటోలను పంచుకున్నారు. ఈ వేడుకకు ఆమె సముద్ర ఆకుపచ్చ రంగు చీరలో ఎంతో సంప్రదాయబద్ధంగా కనిపించారు. బంగారు డిజైన్‌లతో కూడిన బ్లౌజ్‌, జడలో తెల్లని గజ్రా, ఎరుపు రాళ్ల నగలు, సింపుల్‌ మేకప్‌తో ఆమె లుక్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఫొటోల కంటే ఎక్కువగా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది ఆమె పెట్టిన క్యాప్షన్‌. “The love is always louder” అంటూ ఆమె రాసిన వాక్యం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఇది విజయ్‌కు పరోక్ష మద్దతా..? లేక వ్యక్తిగత భావోద్వేగానికా..? అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం( Tamilaga Vettri Kazhagam) సంచలన విజయం సాధించింది. మొత్తం 118 స్థానాలను గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని సాధించింది. కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్‌ వంటి పార్టీల మద్దతుతో టీవీకే అధికారంలోకి వచ్చింది. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్‌( Rajendra Arlekar) విజయ్‌ను ముఖ్యమంత్రిగా నియమిస్తూ అధికారిక ఆహ్వానం అందించారు. మే 13లోపు అసెంబ్లీలో మెజారిటీ నిరూపించాలని సూచించారు.

విజయ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వేళ.. ఆయన తల్లిదండ్రులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్‌( S. A. Chandrasekhar) తన కుమారుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం జీవితంలో గర్వకారణమని అన్నారు. విజయ్‌ తల్లి శోభా చంద్రశేఖర్‌(Sobha Chandrasekhar)మదర్స్ డే రోజున నా కుమారుడు సీఎం కావడం ఎంతో భావోద్వేగంగా ఉంది” అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

1967 తర్వాత డీఎంకే, అన్నాడీఎంకేల నుంచి కాకుండా ఒక నాయకుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో విజయ్‌ రాజకీయ ప్రవేశం చారిత్రాత్మకంగా మారింది.

విజయ్‌, త్రిషల రిలేషన్‌ గురించి…

ఇక విజయ్‌, త్రిషల మధ్య ఉన్న స్నేహం చాలా కాలంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. ఇద్దరూ కలిసి Ghilli, Thirupaachi, Aathi, Kuruvi, Leo వంటి హిట్ సినిమాల్లో నటించారు. వీరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి అభిమానుల్లో ప్రత్యేక క్రేజ్ ఉంది.

గత కొంతకాలంగా విజయ్‌, త్రిషలపై సోషల్ మీడియాలో రిలేషన్‌షిప్ రూమర్లు ఎక్కువయ్యాయి. అయితే ఇద్దరూ ఇప్పటివరకు వాటిపై స్పందించలేదు. ఇటీవల విజయ్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని వార్తలు బయటకు రావడంతో మళ్లీ ఈ ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో ఇద్దరూ కలిసి పలు కార్యక్రమాలకు హాజరుకావడం, ఒకే కారులో రావడం వంటి సంఘటనలు సోషల్ మీడియాలో మరింత చర్చకు దారితీశాయి.

ఇప్పుడు విజయ్‌ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార వేడుకలో త్రిష హాజరు కావడం, అనంతరం ప్రేమ గురించి ఆసక్తికర వ్యాఖ్య చేయడం కోలీవుడ్‌లో మరోసారి సంచలనంగా మారింది. అభిమానులు మాత్రం ఈ జంట ఎప్పటికీ స్పెషల్‌ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Latest Articles

అమిత్‌షాతో చంద్రబాబు భేటీ… ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులపై చర్చ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కీలక భేటీ నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించినట్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్