“రేవంత్ నాతో కలువు”.. తెలంగాణ సీఎంకు ప్రధాని మోదీ బంపరాఫర్

హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌·రెడ్డి (Revanth Reddy)ని ఉద్దేశించి ప్రధాని మోదీ (PM Modi) ఆసక్తికర వ్యాఖ్య చేశారు. పలు ప్రాజెక్టులకు వర్చువల్‌ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ప్రధాని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చెబుతూ రైల్వే ప్రాజెక్టుల ప్రస్తావన తీసుకొచ్చారు.

గతంలో రైల్వే బడ్జెట్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రూ.వెయ్యి కోట్లు కూడా వచ్చేవి కాదని మోదీ అన్నారు. ఈ క్రమంలో వేదికపై ఉన్న సీఎం రేవంత్‌ను ఉద్దేశిస్తూ ‘‘రేవంత్‌రెడ్డి గారూ.. ఇది వింటున్నారా?’’ అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఒక్క తెలంగాణకే రూ.ఐదున్నర వేల కోట్లు కేటాయించామని… అందుకే సీఎం రేవంత్ ను తమతో కలవమని చెబుతున్నామని చెప్పారు. రేవంత్ తన వెంట కలిసి పనిచేస్తే .. ఆయనను చేరాల్సిన గమ్యస్థానానికి తీసుకెళ్తానని .. ప్రధాని సరదాగా చేసిన వ్యాఖ్యలతో రేవంత్‌తో పాటు వేదికపై ఉన్న కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ తదితరులు నవ్వేశారు.

 

 

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్