అక్కినేని నాగచైతన్య, తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కిన బైలింగ్వల్ చిత్రం ‘కస్టడీ’ నుంచి లేటెస్ట్ అప్టేడ్ వచ్చింది. ఈ చిత్రం నుంచి ‘టైమ్ లెస్ లవ్’ అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. విడుదలైన కొద్ది సమయంలోనే ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది. మ్యాస్ట్రో ఇళయరాజా, ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. యువన్, కపిల్ కపిలన్ ఈ పాటను ఆలపించిన తీరు అభిమానులను కట్టిపడేస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తోన్న ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్ తదితరులు ఈ చిత్రంలో నటించారు.
ట్రెండింగ్ లో నాగచైతన్య ‘టైమ్ లెస్ లవ్’ లిరికల్ సాంగ్
0
440
Previous article
Next article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


