మరో నాలుగు నెలల్లోనే తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. ఈసారి రాష్ట్రంలో కచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని.. ఛత్తీస్ గఢ్ తరహాలో ధాన్యం కొనుగోలు చేస్తామని కోమటిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ఈ హామీలు ఇస్తున్నానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మునుగోడు ఉపఎన్నిక గురించి రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ మధ్య కొనసాగిన విమర్శల వ్యవహారంపై తాను మాట్లాడేది ఏమి లేదని వ్యాఖ్యానించారు.