వరంగల్-నల్గొండ-ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో త్రిముఖ పోటీ

నువ్వా-నేనా అన్నట్లుగా సాగుతోంది తెలంగాణలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం. పోలింగ్ తేదీ సమీపి స్తుండడంతో విస్తృతంగా కేంపెయినింగ్ నిర్వహిస్తున్నారు అన్ని పార్టీల నేతలు. వివిధ పార్టీలకు చెందిన అగ్రనేతలు స్వయంగా ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ తమ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపునకు తీవ్రంగా ప్రయత్నిస్తుండడంతో.. పట్టభద్రుల పోరులో ఎవరిది పైచేయి అవుతుందన్నది ఆసక్తి రేపుతోంది.

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక సైతం నిర్వహించారు. వీటి ఫలితాలు వచ్చేనెల నాలుగున రానున్నాయి. దీంతో అందరి చూపూ లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై నెలకొంది. అటు రాజకీయ పార్టీల నేతలదీ ఇదే పరిస్థితి అయినా పట్టభద్రుల ఎమ్మె ల్సీ ఉప ఎన్నిక మాత్రం మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న నేతల్లో హీటు పుట్టిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి మొన్నటి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం గెలుపొందడంతో ఉప ఎన్నిక అనివార్య మైంది. దీంతో వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈనెల 27న జరగనుంది. పోలింగ్‌కు పెద్దగా సమయం లేకపోవడంతో అభ్యర్థులు, వారి పార్టీలకు సంబంధించిన అగ్రనేతలు ప్రచార పర్వాన్ని ఇప్పటికే హోరెత్తిస్తున్నారు. దీంతో తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలూ ఈ పట్టభ ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను సవాలుగా తీసుకున్నాయి.

ప్రతిపక్ష బీఆర్ఎస్ విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం ఆ పార్టీని తీవ్రంగా కుంగదీసిందనే చెప్పాలి. దానికితోడు నేతల పార్టీ మార్పులు మరింత ఇబ్బంది పెట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపు అవకాశాలు ఎంత అంటే ఇంత అని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉందన్న మాట విన్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలుపుకునేందుకు బీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గులాబీ పార్టీ తరఫున పోటీలో ఉన్న రాకేష్ రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను కోరుతున్నారు కేటీఆర్.

ఇక, కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్నారు తీన్మార్ మల్లన్న. బీఆర్ఎస్‌కు సిట్టింగ్ స్థానంగా ఉన్న ఈ ఎమ్మెల్సీ సీటులో పాగా వేయడం ద్వారా మరింతగా దెబ్బకొట్టాలని హస్తం పార్టీ భావిస్తోంది. దీంతో.. కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ, సీతక్కతోపాటు హస్తం పార్టీకే చెందిన ఎమ్మెల్యేలు, కీలక నేతలు ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల సదస్సులను నిర్వహించారు. మేధావులు, విద్యావంతులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరుతు న్నారు. అటు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటును గెలవాలనే లక్ష్యంతో బీజేపీ అగ్రనేతలు ప్రచార పర్వంలోకి దిగారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితోపాటు బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ సహా పలువురు విస్తృతంగా కేంపెయినింగ్ చేస్తున్నారు. కమలం తరఫున పోటీలో ఉన్న గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గెలుపు నకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోరు మూడు పార్టీలకూ సవాలుగా మారిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్