- ప్రభుత్వ అప్పీల్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
- సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించిన చీఫ్ జస్టిస్ బెంచ్
- సీబీఐతో విచారణ జరిపించాలని ఆదేశం

హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ అప్పీల్ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ బెంచ్ కొట్టివేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును చీఫ్ జస్టిస్ బెంచ్ సమర్థించింది. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఇచ్చిన సింగిల్ బెంచ్ తీర్పు అమలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం అప్పీల్ పిటిషన్‌ని హైకోర్టు కొట్టివేసింది.