తుమ్మలను బీఆర్ఎస్‌లో అవసరానికి వాడుకుని వదిలేశారు- ఈటల రాజేందర్

స్వతంత్ర వెబ్ డెస్క్: బీఆర్ఎస్ నుంచి పాలేరు టికెట్ రాకపోవడంతో తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన ఆయన.. ఏ పార్టీలో చేరుతారనేది ఇంకా స్పష్టం చేయలేదు. కాంగ్రెస్‌లో చేరాలని అనుచరులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తుమ్మల నాగేశ్వరరావును బీజేపీలోకి ఆహ్వానిస్తామని ఈటల చెప్పారు. ఈ విషయంలో ఆయన్ను కలిసి చర్చిస్తామని వెల్లడించారు.

తుమ్మలను బీఆర్ఎస్‌లో అవసరానికి వాడుకుని వదిలేశారని ఆరోపించారు. ఆయన్ను తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చారు. తెలంగాణలో రైతాంగం కష్టాల్లో ఉందని ఈటల అన్నారు. రాష్ట్ర రైతులకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. ఈ రోజు ఖమ్మంలో జరగబోయే బహిరంగ సభలో రైతు డిక్లరేషన్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటిస్తారని వెల్లడించారు. ఈ సభ ద్వారా బీజేపీ వైఖరిని స్పష్టం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

Latest Articles

ధనుష్‌.. ప్లాన్ అదిరింది..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్