తెలంగాణలో మెడికల్ షాపుల వ్యవహారం ఇప్పుటు హాట్ టాపిక్‌గా మారింది. స్వతంత్ర టీవీ స్టింగ్ ఆపరేషన్‌లో దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మెడికల్ షాపు లైసెన్స్ ఒకరిది అయితే.. మందుల షాపు నిర్వహిస్తుండేది మరొకరు. రాష్ట్రవ్యాప్తంగా 95 శాతం ఇదే పరిస్థితి నెలకొంది. ఫార్మాసిస్ట్ ఎక్కడా అంటే చిత్రమైన సమాధానాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా బీఫార్మసీ చేసిన వారు మెడికల్ షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కానీ, క్షేత్రస్థాయిలో జరుగుతోంది మాత్రం దీనికి భిన్నమైనది. స్వతంత్ర టీవీ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి.