స్వతంత్ర, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టాపహాడ్ గ్రామంలో చెరువు పండుగ చిచ్చు రేపింది. పోలీసులు తము నిర్వహిస్తున్న పండుగను అడ్డుకున్నారంటూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే దిష్టిబొమ్మను ఊరంతా తిప్పుతో ఊరేగించారు. ఇక మహిళలు.. దిష్టిబొమ్మను మధ్యలో పెట్టి బతుకమ్మ ఆడారు. గత కొన్నేళ్లుగా పుట్టాపహాడ్ పక్క గ్రామం గాధిర్యాల మధ్య చెరువు వివాదం కొనసాగుతుంది. అప్పటి నుండి చెరువు మాదంటే మాదంటూ రెండు గ్రామాల మధ్య గొడవలు జరిగేవి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు చెరువు పండుగ కోసం పుట్టాపహాడ్ గ్రామస్తులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో పండగ నిర్వహించ నివ్వొదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు గాధిర్యాల గ్రామస్తులు. దీంతో చెరువు పండుగను పోలీసులు అడ్డుకోవడంతో వివాదం చెలరేగిపోయింది.
చిచ్చు రేపిన చెరువు పండుగ.. ఇరు గ్రామాల మధ్య ఘర్షణ
0
412
- Tags
- pond festival
Previous article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


