21.7 C
Hyderabad
Saturday, February 8, 2025
spot_img

మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో విపక్ష కూటమి..!

స్వతంత్ర వెబ్ డెస్క్: మణిపూర్ లో జాతుల మధ్య చోటు చేసుకున్న హింస అంశం పార్లమెంటులో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ అల్లర్లపై ప్రధాని మోదీ పార్లమెంటులో ప్రకటన చేయాలని ఎంపీలు పట్టుబట్టడంతో ఉభయసభల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. మంగళవారం ఉదయం 11.00 గంటలకు ప్రారంభమైన లోక్‌సభను స్పీకర్ ఓం బిర్లా కొన్ని నిమిషాల్లోనే వాయిదా వేశారు. మధ్యాహ్నం 2.00 గంటలకు దిగువ సభ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అయితే మణిపూర్ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు విపక్షాలు పాటుపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జు్న ఖర్గే ఛాంబర్‌లో జరిగిన విపక్ష నేతల సమావేశంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా మణిపూర్ అల్లర్లతో సహా అనేక కీలకమైన అంశాలపై చర్చించే అవకాశం ఉంటుందని విపక్షాల ఆలోచనగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రధాని మణిపూర్ పై ప్రకటన చేయాలంటూ విపక్షాలు పట్టుబట్టడంతో వారు వెనక్కి తగ్గుతారని కేంద్రం భావించడం లేదు. దీంతో ఇక బిల్లలు ప్రవేశపెట్టడంపైనే దృష్టి పెడుతున్నట్లు సమాచారం. మణిపూర్ లో జాతుల మధ్య చోటు చేసుకున్న హింస అంశం పార్లమెంటులో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ అల్లర్లపై ప్రధాని మోదీ పార్లమెంటులో ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ అంశం కారణంగా ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరోవైపు విపక్ష కూటమి ఇండియా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మణిపూర్ అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో… కేంద్రానికి వ్యతిరేకంగా లోక్ సభలో అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. మరోవైపు విపక్షాల ఆందోళనల నేపథ్యంలో లోక్ సభ మధ్యాహ్నం 2 గంటల వరకు, రాజ్యసభ 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. మరోవైపు ఈ ఉదయం ప్రధాని మోదీ అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. ఇంకోవైపు ఈ సమావేశంలో విపక్షాల తీరుపై మోదీ మండిపడినట్టు సమాచారం. దశ, దిశ లేకుండా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.

Latest Articles

ఆడపిల్లలూ.. బూచోళ్లున్నారు జాగ్రత్త..!

మనుషుల మధ్య మృగాలు తిరుగుతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయి చిన్నారులు, మైనర్లు అని కూడా చూడకుండా తెగబడుతున్నాయి. మనిషి తోలు కప్పుకుని మృగంలా ఆడవాళ్ల మీద అత్యాచారాలకు పాల్పడుతున్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్