ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్ నాథ్ ఆలయం తెరుచుకుంది. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన తలుపులను అధికారులు తెరిచారు. అనంతరం ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కుటుంబంతో కలిసి తొలి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేదారేశ్వరుడికి సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు.శీతాకాలం సందర్భంగా కేదార్‌నాథ్ ఆలయాన్ని మూసివేశారు. దాదాపు ఆరు నెలల తర్వాత తిరిగి తెరిచారు. ఈ సందర్భంగా అధికారులు ఆలయాన్ని పువ్వులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సుమారు 40 క్వింటాళ్ల పూలతో అందంగా ముస్తాబు చేశారు. భక్తులు ఉదయం నుంచే ఆలయానికి క్యూ కట్టారు. చార్‌ధామ్ యాత్రలో భాగమైన బద్రీనాథ్ ఆలయాన్ని ఈ నెల 12న తెరవనున్నట్లు తెలుస్తోంది.
కేదార్ నాథుడి దర్శనానికి తెరుచుకున్న ద్వారాలు
0
351
Previous article
Next article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


