జూలై 26న ‘గల్లీ గ్యాంగ్ స్టార్స్’

‘క్లూ’, ‘మంచి కాఫీ లాంటి కధ’ లాంటి షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన సంజయ్ శ్రీ రాజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ప్రియ శ్రీనివాస్’హీరోయిన్ గా పరిచయం చేస్తున్న సినిమా ‘గల్లీ గ్యాంగ్ స్టార్స్’. ‘మే 16’ అనే ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించిన సంస్థ ‘ఏ బి డి ప్రొడక్షన్స్’ మరో అడుగు ముందుకు వేస్తూ ‘గల్లీ గ్యాంగ్ స్టార్స్’ అనే సినిమాతో ప్రజల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా లోని పాటలు ‘ఆపిల్ మ్యూజిక్’ ‘స్పోటిఫై’ ‘అమెజాన్ మ్యూజిక్’ ‘రిసో ప్లేయర్’ ‘హుంగమ’ ‘జియో సావన్’ ‘గాన’ ‘యుట్యూబ్ మ్యూజిక్’ తదితర మాధ్యమాలల్లో అందరిని అలరిస్తున్నాయి. ఈ చిత్రంలోని ‘భోలో శంకరా’ పాటకి విశేష ఆదరణ లభించింది.

దర్శకులు ధర్మ మాట్లాడుతూ ” ‘గల్లి గ్యాంగ్ స్టార్స్’ సినిమాని నెల్లూరులో షూట్ చెయ్యటం జరిగింది. ఈ సినిమా ఒక గల్లీలో నివసించే అనాధలు వాళ్ళు ఎదురుకునే సంఘటనల సమూహం. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ- ఎడిటింగ్- డి ఐ- దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలతో పాటు కధలో కూడా ఆయన పాత్ర ఎంతో ఉంది.’’ అన్నారు.

ప్రొడ్యూసర్ డా. ఆరవేటి యశోవర్ధన్ మాట్లాడుతూ “ఈ సినిమా క్రైమ్ డ్రామా చుట్టూ జరుగుతుంది. ఇందులో నాలుగు ముఖ్య పాత్రలు అనాధలు అని వాళ్ళ జీవితాలు ఎలా ఎవరి వల్ల మలుపు తిరుగుతుందో తెలుసుకోవాలి అంటే సినిమా తప్పకుండా చూడాలి. మాస్ ప్రేక్షకులకి తప్పక నచ్చి తీరుతుంది. చిన్న సినిమాని తప్పక ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఈ సినిమా జూలై 26న రిలీజ్ అవుతుంది” అని చెప్పుకొచ్చారు.

నటీనటులు :
సంజయ్ శ్రీ రాజ్, ప్రియ శ్రీనివాస్, భరత్ , రితిక, Rj బాలు, చందు, తారక్, మురళి కృష్ణ రెడ్డి

టెక్నీషియన్స్ :
నిర్మాణం : ఏ బి డి ప్రొడక్షన్స్
నిర్మాత: డా. ఆరవేటి యశోవర్ధన్
స్టొరీ మరియు దర్శకుడు: వెంకటేష్ కొండిపోగు, ధర్మ
డి ఓ పి- ఎడిటర్- రచయత- దర్శకత్వ పర్యవేక్షణ : ధర్మ
సంగీత దర్శకుడు: సత్య, శరత్ రామ్ రవి
పి ఆర్ ఓ: మధు VR

Latest Articles

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్