హాలీవుడ్ నుంచి రాబోతున్న మరో యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డెడ్‌పూల్ & వుల్వరైన్’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హాలీవుడ్ స్టార్ హ్యూ జాక్‌మన్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ‘మీకు ప్రస్తుతం క్రికెట్‌లో ఎవరంటే బాగా ఇష్టం?’ అని అడగ్గా.. దానికి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ‘రోహిత్’ అని సమాధానం చెప్పి భారతీయ క్రికెట్ ప్రేమికుల మనసు దోచుకున్నాడు హ్యూ జాక్‌మన్. రోహిత్ శర్మ రీసెంట్‌గా ఇండియాకి వరల్డ్ కప్ సాధించాడు అని అడగ్గా.. ‘నాకెందుకు తెలీదు. రోహిత్ ఒక బీస్ట్‌లాగా ఆడతాడు. నాకు అతని ఆట చూడడం చాలా ఇష్టం’ తన అభిమానాన్ని ఎవర్‌గ్రీన్ సూపర్‌స్టార్ హ్యూ జాక్‌మన్ చాటుకున్నారు.
హ్యూ జాక్‌మన్ రోహిత్‌పై తన అభిప్రాయాన్ని చెప్పడం వల్ల భారత దేశంలోని కోట్లమంది గుండెల్లో హ్యూ జాక్‌మన్ ఆనందం నింపేలా చేశారు. మార్వెల్ స్టూడియోస్ ‘డెడ్‌పూల్ & వుల్వరైన్’ జూలై 26న ఇంగ్లీష్, హిందీ, తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కాబోతుంది.