శ్రీశైలం ఘాట్ రోడ్డులో అదుపు తప్పిన బస్సులు..తప్పిన పెను ప్రమాదం
లోయలోకి దూసుకెళ్లి బస్సు బోల్తా.. ప్రయాణికులకు గాయాలు
రెయిలింగ్‌ను ఢీకొట్టి నిలిచిన మరో బస్సు
శ్రీశైలం ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. మితిమీరిన వేగంతో రెండు బస్సులు అదుపు తప్పాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శ్రీశైలం నుంచి దోర్నాల వైపు వస్తోంది. ఘాట్‌రోడ్డులో ఎదురొచ్చిన వాహనాలను తప్పించే క్రమంలో రోడ్డు మార్జిన్ దిగిం ది. అప్పటికే అక్కడ వర్షపు జల్లులు పడుతుండటంతో పాటు వేగం కారణంగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇనుప రిటైనింగ్ వాల్‌ను దాటి లోయలోకి దూసుకెళ్లింది. బస్సులో ఉన్న 30మంది ప్రయాణికులు భయాందోళనతో కేకలు వేశారు. అదే సమయంలో బస్సు చెట్లను ఢీకొట్టి బస్సు నిలిచిపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అదే సమయంలో ఆ బస్సు వెనుక వస్తున్న ఇంద్ర బస్సు కూడా వేగం అదుపు కాక రోడ్డు పక్కన ఉన్న రక్షణ ఇనుప కమ్మీలను ఢీకొట్టి నిలిచిపోయింది. అందులో ఉన్న 12 మంది ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
అయితే ఈ ప్రమాదాల్లో ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


