తెలంగాణ బిజినెస్ హబ్‌గా మారబోతోంది – సీఎం రేవంత్

రాబోయే రోజుల్లో తెలంగాణ బిజినెస్ హబ్‌గా మారబోతోందని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. జూబ్లిహిల్స్‌లోని తన నివాసంలో విద్యుత్‌ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. విద్యుత్ శాఖ రాబడి, డిస్కమ్స్ రెవెన్యూ లోటు, ఇతర అంశాలపై చర్చించారు. ఐటీ, ఇండస్ట్రియల్ శాఖలతో సమన్వయం చేసుకుని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని ఈ సందర్బంగా విద్యుత్ శాఖ అధికారులకు సీఎం ఆదేశించారు. సోలార్ విద్యుత్ వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలన్నారు. వివిధ శాఖల్లో వినియోగంలో లేని భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

రైతులకు సోలార్ పంప్ సెట్ లను ఉచితంగా అందించి వారిని సోలార్ విద్యుత్ వైపు ప్రోత్సహించాలని రేవంత్‌ సూచించారు. కొండారెడ్డి పల్లెను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని ఆదేశించారాయన. సోలార్‌ పంప్ సెట్‌ల ద్వారా వచ్చే మిగులు విద్యుత్‌పై రైతుకు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. వంటగ్యాస్ బదులుగా సోలార్ సిలిండర్ విధానాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వీటిపై మహిళా సంఘాలకు శిక్షణ అందించి వారిని సోలార్ సిలిండర్ బిజినెస్ వైపు ప్రోత్సహించాలని సూచించారు. అటవీ భూముల్లోనూ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రతీ ఏటా 40వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రణాళికాబద్దంగా వ్యవహరించి విద్యుత్‌ దుబారాను తగ్గించాలన్నారు. ఓవర్ లోడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఒక్క నిమిషం కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండొద్దని అధికారులను ఆదేశించారు. వినియోగదారులకు 24గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్న నమ్మకం కలిగించాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్