‘‘సారా…సారా’’…ఇద్దరిలో ఎవరబ్బా!

న్యూజిలాండ్ తో జరిగిన హైదరాబాద్ వన్డే మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ ఊచకోత విధ్వంసకరంగా జరిగింది. తను ఒక్కడు అవలీలగా 208 పరుగులు చేసి, మ్యాచ్ ను గెలిపించాడనే చెప్పాలి. లేదంటే కివీస్ బ్యాట్స్ మేన్ మైఖేల్ బ్రేస్ వెల్ (140) దెబ్బకి మనోళ్లు మ్యాచ్ అప్పగించేసేవాళ్లే.

అప్పటికే స్టార్ బ్యాట్స్ మేన్లు అందరూ చేతులెత్తేసిన వేళ… శుభ్ మన్ గిల్… చేసిన 208 పరుగులు మనల్ని విజయ తీరాలకు చేర్చాయి. ఇంతకీ విషయం ఏమిటంటే స్టేడియంలో గిల్ సిక్సర్లు కొడుతుంటే…సారా…సారా…అంటూ స్టేడియం నుంచి అరుపులు, కేకలతో దద్ధరిల్లిపోయింది. వారిని చూసి నవ్వుతూ ‘గిల్…’ బ్యాట్ చూపించేసరికి అభిమానులు మరింత రెచ్చిపోయారు.

అయితే ఇక్కడ సారా…సారా…అని అందరూ పిలుస్తుంటే ఒకరేమో ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా అయితే, మరొకరు సైఫ్ ఆలీఖాన్ సోదరి సారా ఆలీఖాన్…ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే…వీరిద్దరితోనూ గిల్ డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే మొదట మాత్రం సచిన్ కుమార్తెతో గిల్ డేటింగ్ వార్తలు హల్ చల్ చేశాయి. ప్రస్తుతం సారా ఆలీఖాన్ తో వ్యవహారం నడుస్తున్నట్టు అందరూ అనుకుంటున్నారు. హోటల్స్ నుంచి వారిద్దరూ కలిసి మెలిసి వస్తున్నట్టుగా చెబుతున్నారు.

‘ఇప్పటికైనా లవ్ మ్యాటర్ చెప్పు బ్రదర్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.‘‘ సచిన్ అల్లుడు’’ అంటూ మీమ్స్ కూడా తెగ ట్రోల్ అవుతున్నాయి.

ఇకపోతే బస్సులో వెళుతుండగా అభిమానులు కొందరు ‘‘సచిన్ ని బాగా చూసుకో’’ అని చెబుతుంటే గిల్ నవ్వుతూ తలుపు అద్దం వేసేశాడు. అయితే నిప్పు లేకుండా పొగ రాదు కదా…ఇటీవల గిల్ కొత్త కారు కొన్నాడు. దానికి సచిన్ కూతురు ‘సారా’ అభినందనలు తెలియజేసింది. గిల్ చెప్పకుండానే హార్దిక్ పాండ్యా స్పందించాడు. ‘‘నీ బదులు సారాకు నేను కృతజ్నతలు చెబుతున్నాను’’ అని రాసేసరికి ఆ కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి.

ఇకపోతే వీరిద్దరి అభిప్రాయాలు ఒకటే అని చెప్పడానికి తాజా ఉదాహరణ ఒకటి జరిగింది. గిల్ తన ఫొటో ఒకటి పోస్ట్ చేస్తూ…దానిపై ‘ఐ స్పై’ అని కామెంట్ పెట్టాడు. అదే సమయంలో సారా కూడా తన ఫొటో పెట్టి దానిపై ‘ఐ స్పై’ అని రాసింది. అయితే ఎవరు ఎవరిపై నిఘా పెట్టారో తెలీదుగానీ, మొత్తానికి వీరిద్దరి వ్యవహారంతో నెటిజన్లకు చేతి నిండా పని దొరికినట్టయ్యింది.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్