అయిదేళ్లలో రాష్ట్రం నాశనమైందన్నారు మంత్రి నారా లోకేష్. NRIలు కూడా జగన్ బాధితులే అన్నారు. కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి 500 కోట్లు అమరావతిలో పెట్టుబడి పెట్టారని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక విజిలెన్స్ వాళ్లను పంపి ఇబ్బందులు పెట్టారని.. అడుగడుగునా అవమానించారని మండిపడ్డారు. అయినా ఆయన ధైర్యంగా నిలబడ్డారన్నారు. చరిత్రలో ఎప్పుడూ రానివిధంగా ఈసారి కూటమి అభ్యర్థులకు భారీ మెజార్టీతో గెలిచారని.. 92శాతం సీట్లు ఇచ్చారన్నారు. మంగళగిరి ప్రజలు తనను 91వేల పైచిలుకు మెజారిటీతో గెలిపించారని చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా వైసీపీని తరిమికొట్టాలని కంకణం కట్టుకోవడంతో ఇంతటి ఘనవిజయం సాధ్యమైందన్నారు నారా లోకేష్.