కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం.. మూడు పార్టీలు ఒకటేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు బీజేపీ గెలవాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్ లో సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. దేశంలో ఎవరిని అడిగినా మోదీ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారని తెలిపారు. కేంద్రం అమలుచేసే పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. బీఆర్ఎస్‌కు సీట్లు వచ్చినా, రాకున్నా రాష్ట్రానికి ఉపయోగం లేదన్నారు. ఆరు గ్యారంటీల విషయంలో ప్రకటనలకే పరిమితం అయ్యారని విమర్శించారు. మోదీ అవినీతి రహిత పాలన అందించారని అమిత్ షా చెప్పారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీదే అధికారమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి నరేంద్రమోదీని ప్రధానిగా చూడాలనే భావనలో ప్రజలు ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో 12 కంటే ఎక్కువ సీట్లు దక్కించుకుంటామని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా వారియర్స్‌కు అమిత్ షా దిశానిర్దేశం
0
194
Previous article
Latest Articles
సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ
సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -
- Advertisement -


