నిలకడగా సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితి.. హెల్త్‌ బులిటెన్‌ విడుదల

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సింగర్‌ కల్పన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ..గాయని నిద్రమాత్రలు మింగారని వెల్లడించారు. ఆమె ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని తెలిపారు. కల్పనకు ఇన్‌ఫెక్షన్‌ ఉండటం వల్ల ఆక్సిజన్‌ అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం గాయని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కల్పన వాంగ్మూలాన్నిఇవాళ పోలీసులు రికార్డు చేయనున్నట్లు తెలుస్తోంది.

నిన్న రాత్రి ఆసుపత్రికి రాగానే కల్పనకు స్టమక్ వాష్ చేశారు వైద్యులు . లంగ్స్ లో వాటర్ చేరడంతో వెంటిలేటర్ అవసరం అయింది. ప్రస్తుతం వెంటిలేటర్ తీసేసినట్టు తెలుస్తోంది. కొద్దిగా ఇన్‌ఫెక్షన్‌ ఉండడంతో ఆక్సిజన్‌ మీద ఉన్నారు.

అపస్మారక స్థితిలో మంగళవారం రాత్రి కేపీహెచ్‌బీలోని హోలిస్టిక్‌ ఆసుపత్రిలో చేరిన కల్పనకు చికిత్స కొనసాగుతోంది. బుధవారం ఉదయానికి ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. కల్పనను పరామర్శించేందుకు పలువురు గాయనీగాయకులు మంగళవారం రాత్రి ఆసుపత్రికి చేరుకున్నారు. సునీత, గీతామాధురి, శ్రీకృష్ణ, కారుణ్య తదితరులు అక్కడికి చేరుకొని ఆమె ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలోని విల్లాలో ఉంటున్న కల్పన మంగళవారం సాయంత్రం చెన్నైలో ఉన్న భర్తకు ఫోన్‌ చేసి ఆత్మహత్యకు యత్నిస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంటనే కాలనీ సంఘం ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు చెప్పారు. వారొచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే కల్పన అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే సమీప హోలిస్టిక్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికి పరిస్థితి విషమంగా ఉండటంతో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్