Rape on 4 years child | హైదరాబాద్ బంజారా హిల్స్ లోనే డీఏవీ స్కూల్స్ లో అకృత్యాలపై నాంపల్లి కోర్టు తీర్పును వెల్లడించింది. నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన డ్రైవర్ రంజిత్‌కుమార్ కు.. 20 ఏళ్ల జైలు శిక్షవిధిస్తూ నాంపల్లి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తీర్పును వెల్లడించింది.
గతేడాది అక్టోబర్ 17న అంటే సుమారు ఆర్నెళ్ల క్రితం బంజారాహిల్స్ డీఏవీ స్కూల్‌లో దారుణం జరిగింది. ఎల్ కేజి చదివే నాలుగేళ్ల విద్యార్థినిపై ప్రిన్సిపల్ కార్ డ్రైవర్ రజినీకుమార్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తల్లిదండ్రుల వద్ద చిన్నారి ఏడవటంతో ఈ దుర్మార్గపు చర్య బయటపడింది. తీవ్ర కలత చెందిన ఆ తల్లిదండ్రులు.. గత రెండు నెలలుగా డ్రైవర్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. మా పాప అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉందన్నారు. ఈ దారుణ ఘటన ప్రిన్సిపాల్ మాధవి గది పక్కనున్న డిజిటల్ రూమ్ లోనే జరిగిందని ఆరోపించారు. ఇదంతా జరిగిన ఆమె పట్టించుకోలేదని అన్నారు. డ్రైవర్ రజినికుమార్, ప్రిన్సిపాల్ మాధవిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయంపై కేసునమోదు కాగా.. చివరికి ఇద్దరినీ అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఈ ఘటనకు సంభందించిన విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.