Nara Lokesh | వచ్చే ఎన్నికల్లో ‘ఫ్యాన్’ను పీకిపారేయండని వైసీపీ అధినేత జగన్ పై జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ప్రస్తుతం యువగళం పాదయాత్ర ఆలూరు నియోజకవర్గంలో సాగుతుంది. ఈరోజుతో యువగలం 74వ రోజుకు చేరుకుంది. పర్యటనలో భాగంగా దేవనకొండ శివార్లలోని శనగ చేనులో దిగిన లోకేష్… రైతుల కూలీలతో మాట్లాడారు. అయ్యా… విద్యుత్ ఛార్జీలు పెరిగాయని రైతులు ప్రస్తావించగా… వచ్చే ఎన్నికల్లో ‘ఫ్యాన్’ను పీకిపారేయండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో చంద్రన్న ప్రభుత్వం రాబోతుందని.. ఇక మీ కష్టాలన్నీ గట్టెక్కుతాయని అన్నారు. కుంటిసాకులతో వైసీపీ ప్రభుత్వం తొలగించిన పింఛన్లను… తాము అధికారంలోకి వచ్చాక వచ్చాక పునరుద్ధరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు.