Minister Harish Rao| యాదాద్రి జిల్లాకు 2018లో ఎయిమ్స్‌ను కేటాయిస్తే.. నాలుగేళ్ల తర్వాత ప్రధాని మోదీ వచ్చి శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు మంత్రి హరీశ్ రావు. తెలంగాణపై కేంద్రం ఎందుకు ఇంత వివక్ష చూపుతోందని అన్నారు. కేంద్ర సర్కారు ప్రారంభించిన ఎయిమ్స్‌లో ఇప్పటివరకు ఎలాంటి డెవలప్ మెంట్ లేదన్నారు. చౌటుప్పల్‌లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఒక్క ఎయిమ్స్ కేటాయించినందుకే బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. బీజేపీకి చేతలు తక్కువ.. ప్రచారం ఎక్కువని అన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో గత ఏడాది 8 వైద్య కళశాలలు ప్రారంభించుకున్నామని అన్నారు. ఎయిమ్స్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 200 ఎకరాల భూమిని కేటాయించిందని అన్నారు.