AP | మే నెల రాకముందే ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగకు ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రిల్ నెలలో 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రత నమోదవుతుంది. నేడు ఏపీలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానంగా నాలుగు మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని తెలిపింది. ఇక 126 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వడగాల్పుల కారణంగా ప్రజలకు ఎండ దెబ్బ తగిలే అవకాశం ఉంటుందని… ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎండకు శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఏదైనా పానీయాలు చెరుకురసం, నిమ్మరసం.. ఇలా కొన్ని పండ్ల రసాలను తీసుకుంటే కాస్త శక్తివంతంగా ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు.
నేడు ఏపీలో తీవ్ర వడగాల్పులు… అప్రమత్తంగా ఉండాలని సూచన
0
288
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


