పిఠాపురంలో ఉద్రిక్తత…క్షమాపణ చెప్పాల్సిందే అంటున్న జనసేన కార్యకర్తలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ అరెస్టుతో పిఠాపురం పోలీస్ స్టేషన్ వద్ద టెన్షన్‌ వాతావరణం నెలకొంది. యూట్యూబర్ రావణ్ అక్రమ అరెస్టు నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు నినాదాలు చేశారు. మరోవైపు జనసేన నాయకులు, కార్యకర్తలు యూట్యూబర్ రావణ్ డౌన్ డౌన్, బొజ్జ ఐశ్వర్య డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇరువర్గాల నినాదాలతో పిఠాపురం పోలీస్ స్టేషన్ వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

ఇరు వర్గాలు పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తయ్యారు. ఘర్షణలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. పిఠాపురం పోలీస్ స్టేషన్ నుంచి యూట్యూబర్ రావణ్ ను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే జనసేన కార్యక్రర్తలు వీరిని అడ్డుకున్నారు. పవన్‌ కళ్యాణ్‌కు క్షమాపణ చెప్పిన తర్వాతే ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని నినాదాలు చేశారు. రావణ్‌కి మద్దతుగా మరో వర్గం ఆందోళనకు దిగింది. రెండు వర్గాల ఆందోళనలతో పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో మంగళవారం హైదరాబాద్ లో రావణ్‌ని అదుపులోకి తీసుకున్నారు.

Latest Articles

బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గం.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా పురంధేశ్వరి

బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. 13 మందికి జాతీయ ఉపాధ్యక్ష పదవులతో పాటు కీలక పదవులకు ఎంపిక చేసిన వారి జాబితాలను విడుదల చేసింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుల జాబితాలో ఏపీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్