CM Jagan | ప్రకాశం జిల్లా మార్కాపురంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు పర్యటించనున్నారు. ఈ ఉదయం ఉ.9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి 9.55 గంటలకు మార్కాపురం కు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వైఎస్సార్ ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బును జమచేయనున్నారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం అందజేయననున్నారు. సీఎం పర్యటనలో భాగంగా ఉదయం 10.15 గంటల నుంచి మ.12.05 వరకు ఎస్‌వీకేపీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో బహిరంగ సభా వేదిక వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం ఈబీసీ నేస్తం లబ్దిదారులకు నగదు జమచేస్తారు. కార్యక్రమానంతరం మ.12.40కు అక్కడి నుంచి తాడేపల్లికి బయల్దేరుతారు.
సీఎం జగన్ గుడ్ న్యూస్… నేడు అకౌంట్ లో డబ్బు జమ
0
408
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


