బర్త్ డే సందర్భంగా రెండు సినిమాల అప్‌డేట్స్ ఇచ్చిన సెవెన్ హిల్స్ సతీష్

ప్రముఖ నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ తన పుట్టిన రోజు సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ, “గతంలో నేను తీసిన బట్టల రామస్వామి బయోపిక్, అందరి బంధువయా సినిమాలు నాకు మంచి పేరుని తీసుకొచ్చాయి. కోవిడ్ టైం లో కూడా బట్టల రామస్వామి బయోపిక్ ని ప్రజలు ఆదరించారు. అలాగే రిలీజ్ కి రెడీ గా ఉన్న, కాఫీ విత్ ఏ కిల్లర్, సోలో బాయ్ సినిమాలు మిమ్మల్ని త్వరలోనే అలరిస్తాయి. క్రైం థ్రిల్లర్ గా రానున్న కాఫీ విత్ ఏ కిల్లర్ సినిమా ని ఆర్పీ పట్నాయక్ గారు డైరెక్ట్ చేసారు. జీరో టూ హీరో జోనర్ లో సోలో బాయ్ సినిమా రెడీ అయింది.” అని తెలిపారు.

అంతే కాకుండా, “కంటెంట్ ఉంటె, సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. నా గత సినిమాల మాదిరిగానే, డెఫినిట్ గా ఈ రెండు సినిమాలు డిఫరెంట్ జోనర్స్ లో చేసాము. సోలో బాయ్ సినిమా ద్వారా నవీన్ కుమార్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నాం. ఈ సినిమా కూడా ప్రేక్షకులని అలరిస్తుందని కోరుకుంటున్నాను,” అన్నారు సెవెన్ హిల్స్ సతీష్.

సోలో బాయ్ సినిమా గురించి మాట్లాడుతూ, “సినిమా విడుదల ప్లాన్ చేస్తుంటే మా హీరో గౌతమ్ కృష్ణ కి బిగ్ బాస్ అవకాశం వచ్చింది. అతను మళ్ళీ రాగానే, రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాము. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్‌పై సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ నిర్మాతగా పి. నవీన్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా గ్లిమ్ప్స్ కి పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది” అన్నారు సెవెన్ హిల్స్ సతీష్.

నటీనటులు – గౌతం కృష్ణ, శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి, పోసాని కృష్ణ మురళి, అనితా చౌదరి, షఫీ, ఆర్కే మామ, భద్రమ్, ఆనంద్ చక్రపాణి, సూర్య, ల్యాబ్ శరత్, అరుణ్ కుమార్, రజినీ వర్మ తదితరులు.

సాంకేతిక బృందం:
కాస్ట్యూమ్స్ – రిషిక, వీణాధరి
సినిమాటోగ్రఫీ – త్రిలోక్ సిద్ధు
సంగీతం – జుడా సంధ్య
కో-డైరెక్టర్ – కినోర్ కుమార్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ – SK నయీమ్
గీత రచయితలు – శ్యామ్ కాసర్ల, పూర్ణా చారి, చైతన్య ప్రసాద్
కొరియోగ్రాఫర్: ఆటా సందీప్
బ్యానర్ – సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్
నిర్మాత – సెవెన్ హిల్స్ సతీష్ కుమార్
దర్శకత్వం – పి. నవీన్ కుమార్
పిఆర్ఓ : మధు విఆర్

Latest Articles

సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి

విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్