మా ఊరి పొలిమేర-2 సంచలన విజయంతో నటుడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్న కథానాయకుడు సత్యం రాజేష్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం టెనెంట్. మేఘా చౌదరి కథానాయిక. చందన పయావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, అడుకలం నరేష్, ఎస్తేర్ నోరోన్హ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వై.యుగంధర్ దర్శకుడు. మహాతేజ క్రియేషన్స్ పతాకంపై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మాత. ఈ చిత్రం క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ను సోమవారం విడుదల చేసింది.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘జీవితం ఆడే వైకుంఠపాళిలో ఎంచుకున్న పాచికల్లాంటి ఆరు ముఖ్యపాత్రలకి మధ్య జరిగే కథే ఈ చిత్రం.ముఖ్యంగా ప్రస్తుత అర్భన్‌లైఫ్ స్టయిల్‌ని ప్రతిబింబిస్తూ మహిళలు ఎంత అప్రమత్తంగా వుండాలో చెబుతూ, వాళ్లని అలర్ట్ చేసే విధంగా తీర్చిదిద్దబడ్డ ఈ కథ, కథనం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’’ అని అన్నారు. ధనా బాల, చందు, అనురాగ్, రమ్య పొందూరి, మేగ్న తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం, పాటలు: సాహిత్య సాగర్, డీఓపీ: జెమిన్ జోం అయ్యనీత్, ఎడిటర్: విజయ్మక్తవరపు, కథ: శ్రీనివాస వర్మ, వై.ఎస్, క్రియేటివ్ ప్రొడ్యూసర్: పసూన మండవ, కో పొడూసర్: రవీందర్ రెడ్డి, ఎన్.