తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరోసారి అందరిని ఆలోచింపజేసే వీడియో ట్వీట్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేలా ఓ ప్రభుత్వ పాఠశాల పిల్లలు రూపొందించిన వీడియోను నెజిజన్ల తో పంచుకున్నారు. చిన్న తనంలోనే ట్రాఫిక్ రూల్స్‌పై పిల్లలు అవగాహన కల్పిస్తోన్న తీరు అభినందనీ యమని కొనియాడారు. ఇక ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల జరిగే అనర్ధాల గురించి ఒక్కొక్కటిగా పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. తల్లిదండ్రులు, టీచర్స్ వారిలో సామాజిక స్పృహను నింపాలనిని ఆ వీడియో కింద సజ్జనార్ కామెంట్ పోస్ట్ చేశారు. అదే విధంగా ఆ వీడియోను కేంద్ర రోడ్డు రహదారుల మంత్రిత్వ శాఖకు ట్యాగ్ చేశారు. అలాగే రోడ్, రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్ అనే పదాలతో హ్యాష్ ట్యాగ్‌లను జత చేశారు.