తెలంగాణలో రూ.1000కోట్ల భారీ స్కాం జరిగింది: రేవంత్

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై సంచలన అవినీతి ఆరోపణలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు(ORR) లీజ్‌లో రూ.1000 కోట్ల భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఈ స్కామ్‌లో మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, ఐఏఎస్‌ అధికారి అరవింద్ కుమార్ కీలకపాత్ర పోషించారని తెలిపారు. ఇంత పెద్ద స్కాంపై దర్యాప్తు సంస్థలను ఆధారాలతో సహా ఫిర్యాదుచేస్తామని రేవంత్ హెచ్చరించారు.

ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రతి సంవత్సం కేవలం టోల్ రూపంలోనే రూ.700-800 కోట్లు వస్తాయని.. కానీ 30 సంవత్సరాలకు గానూ ముంబైకి చెందిన ఐఆర్‌బీ ఇన్ ఫ్రా సంస్థకు రూ.7,380కోట్లకే ప్రభుత్వం లీజుకు ఇచ్చిందన్నారు. ఇందులో దాదాపు రూ.1000కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇంత భారీ కుంభకోణంపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో కీలకపాత్ర వహించిన సోమేశ్ కుమార్, అరవింద్ ఇద్దరిని వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్