మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ సందర్భంగా మోదీకి పవన్ అభినందనలు

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ చేపట్టిన ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం ఈనెల 30వ తేదీతో 100 ఎపిసోడ్స్‌ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభినందనలు తెలిపారు. రేడియో ద్వారా ప్రధాని నిర్వహించే ఈ కార్యక్రమం ప్రజలందరికీ చేరువైందని.. సామాన్యుల విజయాలను సైతం మోదీ ప్రస్తావించడం ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తుందని కొనియాడారు. 100కోట్ల మందికి పైగా ఈ కార్యక్రమం విన్నారని తెలిపారు. గొప్ప వ్యక్తులు, కళలు, చేతి వృత్తులు, సేవా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు.. ఇలా అనేక అంశాలపై చర్చించడం ద్వారా ‘మన్ కీ బాత్’ ప్రజలకు చేరువైందన్నారు.

ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రారంభ సందేశంలో ‘సేవా పరమో ధర్మ:’ అన్న మాటలు మనసును హత్తుకునే విధంగా ఉంటాయని చెప్పారు. 2014 అక్టోబర్‌ 3న విజయదశమి రోజున ప్రారంభమైన ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగడం అభినందనీయమని జనసేనాని కొనియాడారు. మన్‌ కీ బాత్‌ కార్యక్రమం ఇలాగే భవిష్యత్ లోనూ కొనసాగాలని పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విటర్ లో ఓ వీడియో సందేశం విడుదల చేశారు.

Latest Articles

తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత

తిరుపతి జిల్లా: తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్