వంట గ్యాస్ ధర తగ్గింపుపై TPCC చీఫ్ రేవంత్ రెడ్డి సెటైర్..!

స్వతంత్ర వెబ్ డెస్క్: రక్షాబంధన్ కానుకగా వంట గ్యాస్ ధరలు తగ్గించింది కేంద్రం. సిలిండర్ పై 250 సబ్సిడీని ప్రకటించింది. ఉజ్వల స్కీం లబ్ధిదారులకు సిలిండర్ పై 400 రూపాయలు తగ్గించింది. తగ్గించిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని కేంద్ర కేబినెట్ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 14 కేజీల వంట గ్యాస్ బండ ధర 1100 రూపాయలుగా ఉంది. కేంద్రం తాజా నిర్ణయంతో ఉజ్వల్ లబ్ధిదారులకు ఇకనుండి 700 కే సిలిండర్ లభించనుంది.

ఇక సాధారణ గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ 950 కి లభించనుంది. అయితే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించడం పట్ల ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు రేవంత్ రెడ్డి. “ఒక గజదొంగ దారి దోపిడీ చేసి సర్వం దోచుకొని.. దారి ఖర్చులకోసం 200 రూపాయలు ఉంచుకోమని ఇచ్చాడట. కాంగ్రెస్ హయాంలో 410 గ్యాస్ బండ ధరను రూ. 1200 చేసి, ఇప్పుడు 200 తగ్గించడాన్ని ఇలా కాక మరెలా అర్థం చేసుకోవాలి” అని ట్వీట్ చేశారు.

Latest Articles

పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్‌ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్