స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే బీఆర్ఎస్ 115 మందితో తొలి జాబితా ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆశావహ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. నిన్నటి నుంచి అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో కీలక ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ తరుణంలోనే కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చేందుకు సిద్దం అయ్యారు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీత దయాకర్ రెడ్డి. తాజాగా రేవంత్ రెడ్డిని కలిసిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీత దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటన కూడా చేశారు. ఇక అటు బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ తనయుడు డాక్టర్ వికాస్ రావు, బీఆర్ఎస్ నేత కృష్ణ యాదవ్ బీజేపీలో చేరనున్నారు.
జోరందుకున్న చేరికలు.. కాంగ్రెస్ లోకి మరో మాజీ ఎమ్మెల్యే
0
470
Latest Articles
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్.. పేలిన ఏసీ.. ఊపిరాడక ఇద్దరు శిశువులు మృతి
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. నిన్న 5 రోజుల చిన్నారి ఊపిరాడక మృతి చెందింది.. ఇవాళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో...
- Advertisement -
- Advertisement -


